‘ఏకలవ్య’కు ప్రత్యేక సొసైటీ!

26 Oct, 2019 01:31 IST|Sakshi
శుక్రవారం ఎంఎన్‌జె కేన్సర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో  నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించిన బ్రెస్ట్‌ కేన్సర్‌ అవగాహన వాక్‌లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్‌

ఏర్పాటు చేసిన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ

ఇకపై నిర్వహణ మొత్తం కేంద్రం పరిధిలోనే..

సాక్షి, హైదరాబాద్‌: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు (ఈఎంఆర్‌ఎస్‌) సరికొత్త కళ సంతరించుకోనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో కొనసాగిన ఈ స్కూళ్లు ఇకపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రత్యేక సొసైటీ ద్వారా కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రత్యేక సొసైటీ కింద నడపాలని నిర్ణయించిన కేంద్ర గిరిజన శాఖ తాజాగా సొసైటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 ఏకలవ్య స్కూళ్లు ఉన్నాయి. వీటికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తున్నా గురుకుల సొసైటీ వీటి నిర్వహణ చూసుకుంటోంది. ప్రత్యేక సొసైటీ పరిధిలో కొనసాగనున్నందున నిధుల విడుదల సమస్యల పరిష్కారం తదితర అంశాలన్నీ నేరుగా జరగనున్నాయి.

శాశ్వత నిర్మాణాలు
దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలలకు శాశ్వత భవనాలు ఉండాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్త నిర్మాణాలు కూడా చేయనుంది. ప్రస్తుతం చాలా వరకు శాశ్వత భవనాలున్నా మౌలిక వసతుల లేమి తీవ్రంగా ఉంది. దీన్ని పరిష్కరించి అత్యున్నత విద్యాలయాలుగా తీర్చి దిద్దాలని కేంద్రం భావిస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు