‘మర్కజ్‌పై కేంద్రానికి సమాచారమిచ్చింది మేమే’

1 Apr, 2020 17:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా పని చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాలని తొలుత కేంద్ర ప్రభుత్వానికి కోరింది ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని గుర్తుచేశారు.  రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలకు సంబందించి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ లాక్‌డౌన్‌ ప్రకటించిందని అన్నారు. మర్కజ్‌ గురించి కేంద్రానికి సమచారం అందించింది కూడా తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు. దేశానికే తెలంగాణ దిక్సూచిగా ఉందన్నారు. 

రాష్ట్రం నుంచి వెయ్యి మందికి పైగా మర్కజ్‌కు వెళ్లినట్టుగా చెప్పారు. వారిలో 160 మందిని తప్ప అందరినీ గుర్తించామని వెల్లడించారు. కేవలం రెండు రోజుల్లోనే ఇంత మందిని గుర్తించి పరీక్షలు చేయిస్తున్నామంటే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరగలేదన్నారు. బుధవారం గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా నుంచి కోలుకున్న మరో ఇద్దరు డిశ్చార్జ్‌ అవుతున్నారని తెలిపారు. డిశ్చార్జ్‌ అయిన వారందరూ 14 రోజులపాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని కోరారు. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 6 గురు చనిపోయారని చెప్పారు.

మార్కజ్‌ యాత్రికులపై డీజీపీ సమీక్ష..
రాష్ట్రవ్యాప్తంగా మర్కజ్‌ యాత్రకు వెళ్లి వచ్చిన యాత్రికుల వివరాలు తెలుసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మర్కజ్‌ యాత్రకు వెళనవారందరిని క్వారంటైన్‌ తరలించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. మర్కజ్‌ యాత్రకు వెళ్లి వచ్చినవారు స్వచ్ఛందంగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలో రిపోర్ట్‌ చేయాలని కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా