దసరాలోగా ‘డబుల్‌ బెడ్‌రూం’

3 Apr, 2018 07:51 IST|Sakshi
గణేశ్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూం పనులు పరిశీలిస్తున్న ఈటల రాజేందర్‌

అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలి

మినీ ట్యాంక్‌బండ్‌ పనులు జూన్‌ లోపు పూర్తి కావాలి

రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

సాక్షి,హుజూరాబాద్‌: దసరా పండగ లోగా డబుల్‌ బెడ్‌రూం పనులను పూర్తి చేయాలని, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. పట్టణంలోని మోడల్‌ చెరువు వద్ద మినీ ట్యాంక్‌బండ్, డబుల్‌ బెడ్‌రూం పనులను సోమవారం మంత్రి పరిశీలించారు. జూన్‌ లోపు ట్యాంక్‌బండ్‌ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ట్యాంక్‌ బండ్‌ చుట్టూ 4 ప్రాంతాల్లో పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సారెస్పీ కెనాల్‌ సమీపంలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని పార్కుగా చేయాలని అధికారులను ఆదేశించారు. వాకింగ్‌ ట్రాక్‌ను 30 మీటర్లు వెడల్పుగా చేయాలని సూచించారు.
ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ పనులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గణేశ్‌నగర్‌లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనులను పరిశీలించారు. నగర పంచాయతీ చైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్‌ చైర్మన్‌ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, సీఈ శ్యాంసుందర్, ఎస్‌ఈ వెంకటకృష్ణ, ఈఈ శ్రీనివాస్‌రావు గుప్తా, డీఈ శ్రీనివాసులు, ఏఈ సంజీవ, ఆర్‌అండ్‌బీ డీఈ కృష్ణారెడ్డి, ఏఈ రాజునాయక్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్, మండల, పట్టణాధ్యక్షులు కొంరారెడ్డి, శ్రీనివాస్, నాయకులు రమేశ్‌గౌడ్, శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, పంజాల రాంశంకర్‌గౌడ్, పోతుల సంజీవ్, ముక్క రమేశ్, కన్నెబోయిన శ్రీనివాస్, మారపల్లి సుశీల, ఇమ్రాన్, బాలరాజు పాల్గొన్నారు.

మానవ కల్యాణ వేదికగా నాయిని చెరువు
జమ్మికుంట(హుజూరాబాద్‌): దర్గంధానికి కేంద్రమైన నాయిని చెరువును మానవ కల్యాణానికి వేదికగా మారుస్తానని మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు మినీ ట్యాంక్‌బాండ్‌ పనులను పర్యవేక్షించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని నక్లెస్‌ రోడ్డును తలపించేలా జమ్మికుంట నాయిని చెరువు రూపురేఖలు మారుస్తానని అన్నారు. నగర పంచాయతీ చైర్మన్‌ పోడేటి రామస్వామి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పింగిళి రమేశ్, వైస్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, తహసీల్దార్‌ బావ్‌సింగ్, పోనగంటి మల్లయ్య పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు