కేసీఆర్‌ కిట్‌ గ్లోబల్‌ టెండర్లతో ఆదా

29 Oct, 2019 02:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కేసీఆర్‌ కిట్‌ ఆన్‌లైన్‌ గ్లోబల్‌ టెండర్లతో ఈ ఏడాది సర్కారుకు రూ.7 కోట్లు ఆదా అయినట్లు వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈసారి టెండర్లలో 8 కంపెనీలు పాల్గొనగా ఎల్‌–1 వచ్చిన కంపెనీ రూ.1593.97 కోట్‌ చేసిందని, గతం కంటే ఇది రూ.120 తక్కువ అని తెలిపారు. మొత్తం 6 లక్షల కిట్లకు గాను రూ. 7.14 కోట్లు ఆదా అయిందన్నారు. కేసీఆర్‌ కిట్ల పంపిణీలో అంతరాయం కలగకుండా ఉండేందుకు బిడ్‌ చేసిన ధరకే ఎల్‌–1కు 50 శాతం, ఎల్‌–2కు 30 శాతం, ఎల్‌–3కి 20 శాతం కేటాయించినట్లు తెలిపారు. రాబోయే రెండేళ్లలో 6 లక్షల కిట్లు అవసరమవుతాయన్న అంచనా ఉందన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా