విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట

12 Feb, 2018 16:14 IST|Sakshi
రాంరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రలు నాయిని, ఈటల

గడ్డం రాంరెడ్డికి పద్మ అవార్డుకు సిఫార్సు

మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్‌

శాతవాహనయూనివర్సిటీ:  రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్రపౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ఆర్ట్స్,సైన్స్‌ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన దూరవిద్య పితామహుడు గడ్డం రాంరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దూరవిద్య ద్వారా లక్షలాది మంది పేదలు ఉన్నత విద్యకు చేరువయ్యారన్నారు. రాంరెడ్డి కరీంనగర్‌ జిల్లాలోని మైలారం గ్రామానికి చెందినవారన్నారు. దేశంలోని అత్యున్నత యూనివర్సిటీలకు వీసీగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందుబాటులో తెస్తామన్నారు. ఇప్పుడు నిధులకు కొరత లేదని, బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు.

ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ విద్యకోసం పరితపించిన వ్యక్తుల్లో రాంరెడ్డి అగ్రగణ్యుడని కొనియాడారు. రాంరెడ్డికి పద్మ అవార్డు విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చించి కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. సామాన్యులకు ఉన్నత విద్యనందించాలనే లక్ష్యంతో రాష్ట్రం లో 500 రెసిడెన్షియల్‌ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ కోర్టు నుంచి వర్క్‌షాప్‌ వరకు గల రోడ్‌ ను రాంరెడ్డిరోడ్‌గా నామకరణం చేయనున్నట్లు తెలిపా రు. ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ రాం రెడ్డి యూజీసీ చైర్మన్‌గా ఉన్నప్పుడే విద్యాసంస్థలకు న్యాక్‌ గుర్తింపునూ ప్రవేశపెట్టారని గుర్తు చేసుకున్నా రు.

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఐడీసీ చైర్మన్‌ ఈ ద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ దూరవిద్య ద్వారా ఎం ద రో ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్‌రె డ్డి మాట్లాడుతూ రాంరెడ్డి ఆశయసాధనకు కృషి చేయాలని కోరారు. అనంతరం విగ్రహ కమిటీ ప్రతినిధులను సన్మానించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ,   గ్రంథాలయసంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, గడ్డం రాంరెడ్డి కుమారుడు గడ్డం ప్రమోద్‌రెడ్డి, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, విగ్రహ కమిటీ ప్రతినిధులు ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి,  మెతుకు సత్యం, రఘువీర్‌సింగ్, రెడ్డి సంఘం అధ్యక్షు డు ముద్దసాని లక్ష్మారెడ్డి, ఊట్కూరి రాదాకృష్ణారెడ్డి, ఓ పెన్‌ యూనివర్సిటీ సహాయక కేం ద్రం సహాయసంచాలకులు ఈ.రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు