డెంగ్యూ తీవ్రత అంతగా లేదు : ఈటల

10 Sep, 2019 16:20 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రత అంతగా లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. 99 శాతం జ్వరాలు వైరల్‌ ఫీవర్లు మాత్రమేనని చెప్పారు. మంగళవారం ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని పలు వార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీజనల్‌ వ్యాధులపై అధికారులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. 

400 పడకల ఆస్పత్రిలో రోజుకు 675 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వైరల్‌ ఫీవర్ల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అత్యవసర పరిస్థితిలో మరో 150 పడకల ఏర్పాటు చేస్తున్నట్టు వ్లెడించారు. ఖమ్మంలో మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. మెడికల్‌ కాలేజీ అనుబంధ ఆస్పత్రుల్లో మాదిరిగా త్వరలో ఖమ్మం హాస్పిటల్‌లో కూడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం ఆస్పత్రి ఖ్యాతిని పెంచేలా.. సకల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు