‘స్పేర్‌’ ఫోన్‌ ఉండాల్సిందేనట..

11 Jul, 2019 10:45 IST|Sakshi

ఓ సర్వేలో వెల్లడి

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో స్మార్ట్‌ ఫోన్లను వినియోగించే వారిలో అత్యధికులు తప్పనిసరిగా మరో స్పేర్‌ ఫోన్‌ కలిగి ఉన్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ఇ–వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ సెరెబ్రా గ్రీన్, మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఎమ్‌ఎఐటి) సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలను ఓ ప్రకటనలో తెలిపారు.  నగరంలో స్మార్ట్‌ఫోన్లు వినియోగించే వారిలో 55 శాతం మంది స్పేర్‌ ఫోన్‌ను కలిగి ఉన్నారని సర్వే తేల్చింది. నగరంలో కొత్త ఫోన్‌ కొంటున్నవారిలో 9 శాతం మంది మాత్రమే పాత ఫోన్లను రీసైక్లింగ్‌ చేస్తున్నారని, 20.6 శాతం మంది సరైన ధర రాదనే ఉద్దేశంతో పాత ఫోన్లను విక్రయించడం పట్ల ఆసక్తి చూపడం లేదని సర్వే వెల్లడించింది. అయితే ఈ–వేస్ట్‌ను తగ్గించే క్రమంలో ఫోన్లను రీసైక్లింగ్‌కి ఇవ్వడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని 65 శాతం మంది స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకి అవగాహన ఉందని కూడా సర్వేతేల్చడం విశేషం. 

మరిన్ని వార్తలు