ఓటు యెట్లెస్తరు సారు.!

13 Nov, 2018 20:13 IST|Sakshi

 సాక్షి,ఇందూరు: వీవీప్యాట్‌ పనితీరు, ఈవీఎం ద్వారా ఓటు ఎలా వేయాలనే దానిపై కలెక్టరే ట్‌లో ఏర్పాటు చేసిన అవగాహన కేంద్రానికి మంచి స్పందన లభిస్తోంది.  సోమవా రం గ్రామీణ ప్రాంతానికి చెందిన కొంత మంది మహిళలు ఇక్కడకు వచ్చి ‘ఓటు యెట్లెస్తరో సూపియ్యూ సారు’ అని ఓటు వేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. 

నీ ఓటు విలువ తెలుసుకో! 

సాక్షి,కామారెడ్డి అర్బన్‌: శాసనసభ ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభం కావడంతో ఓటు హక్కుపై ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టింది. మరోవైపు, సోషల్‌ మీడియా లో సామాజిక కార్యక్తలు ఒకే ఒక్క ఓటు విలువ ఎంతో తెలుసా? అంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఆ ఓటు విలువను ఇలా వివరిస్తున్నారు.

  • 1999లో ఒకే ఒక్క ఓటు దేశ భవిష్యత్తునే మార్చేసింది. వాజ్‌పేయ్‌ కేవలం ఒక ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. లోక్‌సభలో 270 మంది సభ్యులు ఉంటే బీజేపీ ప్రభు త్వం నిలబడేది. కానీ, 269 ఓట్లు రావడంతో వాజ్‌పేయి ప్రభుత్వం 13 నెలలకే పడిపోయింది.
  • అమెరికా అధ్యక్షుడు థామన్‌ జాఫర్‌సన్, జాన్‌ ఆడమ్స్, రూథర్‌ ఫర్డ్‌ కేవలం ఒక ఓటు మెజారిటీతో అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఒక్క ఓటుతో జర్మనీ నియంత అడల్ఫ్‌ హిట్లర్‌ నాజీ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
  • ఒకే ఒక్క ఓటుతో మొదటి కింగ్‌ జేమ్స్‌ ఇంగ్లాండ్‌ రాజయ్యాడు. 
  •  2004లో కర్ణాటక ఎన్నికల్లో సంతేమారేహళ్లీ (ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గంలో జేడీఎస్‌ అభ్యర్థి ఏఆర్‌ కృష్ణమూర్తి కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయారు. కృష్ణమూర్తి కారు డ్రైవర్‌ ఆ రోజు ఓటు వేయలేదు.      
  • రాజస్థాన్‌లో 2008 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు సీపీ జోషి ఒక్క ఓటు తేడాతో ఓటమి చెందారు. అ ఎన్నికల్లో జోషి కుటుంబ సభ్యులు తల్లి, భార్య, కారు డ్రైవర్‌ ఓటు వేయలేదు. వారు ముగ్గురు ఓటేసి ఉంటే జోషి గెలుపొందే వారు.   
మరిన్ని వార్తలు