స్ట్రాంగ్‌ రూంలో ఈవీఎంలు: కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు

9 Dec, 2018 11:22 IST|Sakshi
పాలిటెక్నిక్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ తదితరులు

సీల్‌ వేయించిన కలెక్టర్, సీపీ, పరిశీలకులు 

సాక్షి, (నిజామాబాద్‌ అర్బన్‌): జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఉపయోగించిన వీవీప్యాట్లు, ఈవీఎంలు, కంట్రోల్‌ యూనిట్‌లను జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ బాలుర, బాలికల కళాశాలలో, ఇండోర్‌ స్టేడియంలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. బాలుర కళాశాలలో నిజామాబాద్‌ అర్బన్, నిజామాబాద్‌ రూరల్, బాలికల కళాశాలలో బోధన్, బాన్సువాడ, ఇండోర్‌ స్టేడియం భవనంలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లకు ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికారులు సీల్‌ వేశారు.

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, సాధారణ ఎన్నికల పరిశీలకులు ధీరజ్‌ కుమార్, సౌరబ్‌రాజ్, దేవేశ్‌ దేవల్, పోలీస్‌ కమిషనర్‌ కా ర్తికేయ, రిటర్నింగ్‌ అధికారి  వీటిని శనివారం పర్యవేక్షించారు.  ఇదే భవనాల్లో అన్ని నియోజక వర్గాలకు ఈ నెల 11న కౌటింగ్‌ నిర్వహించనున్నారు. మీడియా కేంద్రాన్ని పరిశీలించిన అధికా రులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సమాచా ర శాఖ డీడీ మూర్తుజాను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో అంజయ్య, రిటర్నింగ్‌ అధికారు లు జాన్‌ సాంసన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు