బాత్‌రూమ్‌లో జారిపడిన తాజా మాజీ ఎమ్మెల్యే

1 Oct, 2018 15:35 IST|Sakshi

సాక్షి, పరకాల : బాత్ రూమ్‌లో స్నానం చేస్తుండగా పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కింద పడిపోయారు. తలకి గాయం అవ్వడంతో  వెంటనే కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

మరిన్ని వార్తలు