రూ.50 లక్షల గంజాయి పట్టివేత

6 May, 2019 04:36 IST|Sakshi

రెండు కార్లు సీజ్‌.. పోలీసుల అదుపులో ఇద్దరు

పటాన్‌చెరుటౌన్‌: అక్రమంగా తరలిస్తున్న రూ.50 లక్షలు విలువ చేసే 508 కిలోల గంజాయిని సంగారెడ్డి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, పటాన్‌చెరు ఎక్సైజ్‌ పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పటాన్‌చెరులోని ఎక్సైజ్‌ కార్యాలయంలో మెదక్‌ రేంజ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఏబీ శాస్త్రి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రయ్య, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ గాయత్రి విలేకర్లకు వివరాలు వెల్లడించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నుంచి జహీరాబాద్‌కు చెందిన వీరుశెట్టి, కర్ణాటకలోని బీదర్‌ జిల్లా బాల్కికి చెందిన పుత్‌రాజ్‌ నీలారామ్‌ మెట్రాజ్‌ రెండు వాహనాల్లో గంజాయిని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు తరలించేందుకు తీసుకొస్తున్నారని పోలీసులకు సమాచా రం అందింది.

దీంతో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్‌ పోలీసులు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని ముత్తంగి రింగ్‌ రోడ్డు వద్ద శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించి రెండు కార్లలో తరలిస్తున్న సుమారు రూ.50 లక్షలు విలువ చేసే 508 కిలోల గంజాయిని, ఆ కార్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టుకున్న వారు కేవలం డ్రైవర్‌ లే అని, ప్రధాన నిందితులు జహీరాబాద్‌ నియో జకవర్గం ఝరాసంగం చెర్లపల్లి తండాకు చెందిన బన్సీలాల్, కర్ణాటక బల్కికి చెందిన సహదేవ్, రవూఫ్‌ఖాన్‌ అని వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పా రు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐలు, ఎక్సైజ్‌ సీఐ సీతారామిరెడ్డి, ఎస్సైలు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు 

మరిన్ని వార్తలు