నిఘా నీడలో మద్యం అమ్మకాలు..

19 Nov, 2018 11:26 IST|Sakshi
పట్టుబడ్డ మద్యాన్ని చూపుతున్న ఎక్సైజ్‌ అధికారులు (ఫైల్‌)

నిఘానీడలో మద్యం అమ్మకాలు  

విచ్చలవిడి అమ్మకాలకు అడ్డుకట్ట  

జిల్లాలో భారీగా మద్యం పట్టివేత  

ఫిర్యాదు కోసం కంట్రోల్‌ రూం  

తనిఖీలు ముమ్మరం చేసిన ఆబ్కారీ శాఖ   

సాక్షి, వనపర్తి క్రైం: జిల్లాలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌ అధికారులు నిఘా పెంచారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విచ్చలవిడిగా జరిగే మద్యం అమ్మకాలను ఎక్క డికక్కడ నియంత్రించేందుకు  ఆ బ్కారీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సాధారణ రోజుల్లో కంటే ఎన్నికల సమయంలో విక్రయా లు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో అక్రమాలకు పాల్పడే అవకాశాలు లేకపోలేదు.

సమయపాలన పాటించడం, నిఘాకెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, బార్‌కోడింగ్‌ విధానం ద్వారానే అమ్మకాలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. ఇవి అతిక్రమించిన దుకాణాలను సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.  


దుకాణాలపై నిఘా  
ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో ప్రతి మద్యం దుకాణంపై నిరంతర నిఘా ఉండేలా ఆబ్కారీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. నిబంధనల ప్రకారమే మద్యం దుకాణాలు, బార్‌లు నడపాలని సృష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మద్యం దుకాణాలు ఉదయం 10నుంచి రాత్రి 10వరకు, బార్‌లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అమ్మకాలు జరపాలని సూచించారు.

నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 50శాతం కంటే ఎక్కువ విక్రయాలు జరిపితే చర్యలు తప్పవనే భయం విక్రయదారుల్లో నెలకొంది. అధికారులు , సిబ్బంది ప్రతి దుకాణంపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు విక్రయదుకాణాలను పరిశీలిస్తున్నా రు. గొలుసు దుకాణంలో మద్యం విక్రయాన్ని జరిపితే వెంటనే దాడులుచేసి, కేసులు నమోదు చేస్తున్నారు.  


ఫిర్యాదు కోసం కంట్రోల్‌ రూం  
మద్యాన్ని భారీగా నిల్వ ఉంచినా, పంపిణీ చేస్తున్నా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుకోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 08545–230033కి ఫోన్‌ చేయవచ్చు. నాటుసారా తయారీ, అక్రమరవాణా చేసినా వెంటనే ఫోన్‌ చేసి వివరాలు తెలియజేయవచ్చు. ఒక వ్యక్తి తన సొంత వినియోగానికి గరిష్టంగా 6 మద్యం సీసాలు, 12బీరు సీసాలకు  అనుమతి ఉంటుంది. అతిక్రమించి విక్రయిస్తే వారిపై జరిమానాతో పాటు  కేసులు కూడా  నమోదు చేసే అవకాశం ఉంది.  


భారీగా మద్యం పట్టివేత  
జిల్లా కేంద్రంలో వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్‌ సమీపంలోని చెక్‌పోస్టుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా మద్యం పట్టుకున్నారు. అదేవిధంగా గ్రామా ల్లో ఉన్న బెల్టు దుకాణాలపై దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 92కేసులు నమయ్యా యి. కాగా 88 మందిని అరెస్టు చేశారు.

520 లీటర్ల చీప్‌ లిక్కర్, 140 లీటర్ల బీరు సీసాలు, రెండు వాహనాలు స్వా«ధీనపరుచుకున్నారు. ఆబ్కారీ అ«ధికారుల నిఘాతో గొలుసుకట్టు దుకాణాలు భారీ సంఖ్యలో తగ్గాయి. మద్యాన్ని అదుపు చేసేందుకు బెల్టు దుకాణాలపై అధికారులు విరుచుకుపడుతున్నారు. దీంతో అక్రమ మద్యం తగ్గుముఖం పట్టింది.  


మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా  
జిల్లాలో మద్యం విక్రయాలపై ప్రత్యేక ని ఘా ఉంచాం. అక్రమంగా అమ్మినా, నిలువ చేసినా వాటిని నియంత్రించేందుకు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు జిల్లాలో 520 లీటర్ల చీప్‌ లిక్కర్, 120 లీటర్ల బీర్లు, 88మంది అరెస్టు, 92 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. మద్యం దుకాణాలు నిబంధనల మేరకు తెరిచి ఉంచాలి. గ్రామాల్లో ఉన్న బెల్టుషాపులపై దాడులు నిర్వహించడంతో చాలావరకు తగ్గింది.  
– విజయభాస్కర్, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు