కోటిన్నర లీటర్ల బీరు మురుగుపాలు!

28 Apr, 2020 10:57 IST|Sakshi

ఆరు నెలల గడువు తీరిపోవడంతో వినియోగానికి పనికిరాని బీరు

బేవరేజెస్‌ ఇతరత్రా నిల్వ స్టాకు విలువ రూ.240 కోట్ల పైమాటే..  

ఏప్రిల్, మే నెలల్లో రూ.1,200 కోట్ల విలువైన బీర్ల అమ్మకాలకు బ్రేక్‌

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో అమ్మకాల్లేకపోవడంతో రాష్ట్రంలో ఏకంగా కోటిన్నర లీటర్ల బీరు డ్రైనేజీపాలు కానుంది. ఎందుకంటే, బీరు తయారైన తేదీ నుంచి సుమారు ఆరు నెలల పాటు వినియోగించుకోవచ్చు. ఈ లెక్కన చూస్తే రాష్ట్రవ్యాప్తంగా బీర్లు తయారుచేసే బేవరేజెస్‌ సంస్థలు, ఎక్సైజ్‌ డిపోలు, వైన్‌షాపులు, బార్లలో సుమారు 20 లక్షల కాటన్ల బీరు నిల్వ ఉన్నట్టు అంచనా. లీటర్ల లెక్కన తీసుకుంటే సుమారు కోటిన్నర లీటర్ల బీరు గడువు తీరిపో వడంతో వినియోగానికి పనికిరాకుండా పో తోందని ఆబ్కారీ శాఖ లెక్కలు వేస్తోంది. ఏప్రి ల్‌లో సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల కాటన్ల మేర బీరు విక్రయమయ్యేది. దీని విలు వ సుమారు రూ.600 కోట్లు. (ఫేస్‌బుక్‌ వలలో పడి.. బీమా డబ్బు)

ఇక మేలోనూ ఇంతే మొత్తంలో బీరు విక్రయాలు జరిగేవి. మే లో లాక్‌డౌన్‌ ఇంకా పొడిగిస్తే మొత్తంగా రెండు నెలలకు కలిపి సుమారు రూ.1,200 కోట్లు (7.5 కోట్ల లీటర్ల) విలువైన బీర్ల అమ్మకాలకు బ్రేక్‌ పడినట్లే. నిజానికి బీర్ల ఉత్పత్తి మార్చి నెలాఖరు నుంచే పలు బేవరేజెస్‌లో నిలిచిపోయింది. అప్పటికే తయారుచేసిన స్టాకు పలు బా ట్లింగ్‌ యూనిట్లు, ఆబ్కారీ డిపోలు, బార్లు, వై న్స్, క్లబ్‌లలో నిల్వ ఉంది. ఇందులో 6నెలల గడువు తీరిన స్టాక్‌ 20 లక్షల కాటన్ల మేర ఉం టుందని అంచనా. ఒక్కో కాటన్‌లో 12 బీర్లు ఉంటాయి. ఒక్కో సీసాలో 650 మి.లీ బీరు ఉం టుంది. ఈ లెక్కన సుమారు 1.56 కోట్ల లీటర్ల బీరుకు గడువు తీరిపోయిందని ఆబ్కారీ అధికా రులు చెబుతున్నారు. దీనిని అనివార్యంగా డ్రైనేజీ పాలు చేయాల్సిందేనని అంటున్నారు. ఇక, బీర్ల వినియోగంలో రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ అగ్రభాగాన ఉంది. ఏప్రిల్‌లో రాష్ట్రంలో 50 లక్షల కేసుల బీరు వినియోగం ఉండగా, ఇందులో యాభైశాతం అంటే 25 లక్షల కాటన్లు నగరంలోనే విక్రయమయ్యేవి. (‘సూపర్‌’గా దోపిడీ!)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు