ఆడపడుచులకు కాలం చెల్లిన చెక్కులు!   

5 Jul, 2018 08:51 IST|Sakshi
కాలంచెల్లిన చెక్కు

డబ్బులు తీసుకొనేందుకు వెళ్తే తిరస్కరించిన బ్యాంకర్లు

అధికారుల పనితీరుపై లబ్ధిదారుల ఆగ్రహం

తాండూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతున్నాయి. గతంలో జరిగిన మాదిరిగానే తాండూరులో మరోసారి లబ్ధిదారులకు కాలంచెల్లిన చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్‌ మండలాలకు చెందిన వారికి గత 2వ తేదీన మున్సిపల్‌ కార్యాలయంలో మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా 149 చెక్కులు అందజేశారు.

ఇందులో 63 కల్యాణలక్ష్మి, 86 షాదీముబారక్‌ చెక్కులు ఉన్నాయి. వీటిని పొందిన లబ్ధిదారులు బ్యాంకుకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని కోరగా.. చెక్కుల గడువు ముగిసిందని చెప్పడంతో ఖంగుతిన్నారు. దీంతో చేసేదేమీ లేక మళ్లీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆడపడుచులకు కట్నంగా సీఎం కేసీఆర్‌ అందిస్తున్న ఆర్థిక సాయం.. కేవలం అధికారుల నిర్లక్ష్యంతో అపహాస్యమవుతోందని మండిపడుతున్నారు.  

మరిన్ని వార్తలు