విద్యార్థి ఫొటో మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో...

31 Aug, 2014 03:46 IST|Sakshi
విద్యార్థిని ఫొటో మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో...

తప్పుడు పనులతో భవిష్యత్తుకు చేటు
ఫొటోను మార్ఫింగ్ చేసి ‘ఫేస్’ బుక్కయిందొకరు
ప్రేమించనందుకు కత్తితో దాడి చేసిందింకొకరు
యువతిని కిడ్నాప్ చేస్తూ చిక్కిన మరో యువకుడు
ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు
కామారెడ్డి: తమ భావి జీవితానికి బంగారు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు, యువకులు దారితప్పుతున్నారు. టీనేజ్‌లో తామేం చేస్తున్నామో తెలుసుకోలేని పరిస్థితులలో తప్పుడు పనులకు పాల్పడుతూ జీవి తాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవలి కాలం లో కామారెడ్డి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనల ను పరిశీలిస్తే యువత ఎలా పెడదోవ పడుతుందో స్పష్టమవుతోంది. వరుసగా జరిగిన ఘటనలు అటు బాధిత కుటుంబాలనే గాక సమాజాన్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.

చదివి ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు పిల్లలను చదువులకు పంపిస్తుంటే, తోటి స్నేహితులతో కలిసి రకరకా ల వికృత చేష్టలకు పాల్పడడం ద్వారా కన్న వారికి దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ముఖ్యంగా ప్రేమించమంటూ అమ్మాయిలను వేధించడం, ప్రేమించనివారిపై అఘాయిత్యాలు చేయడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సెల్‌ఫోన్ల ద్వారా యువత ఇంట ర్నెట్‌ను వాడుతూ అశ్లీల దృశ్యాలు, చిత్రాలను చూ స్తూ పెడదోవ పడుతున్నారనే అభిప్రాయం ఉంది. ఇంటర్నెట్ ద్వారా జీవితానికి ఉపయోగపడే అంశాల కు బదులు, ఇతర విషయాల్లోకి మరలుతుండడంతో వారు దారి తప్పుతున్నారు. నేరస్తులుగా మారుతున్నారు. తద్వారా ఉన్నత చదువుల లక్ష్యం కూడా దెబ్బతింటోంది. తల్లిదండ్రుల ఆశలు అడియాసలవుతున్నాయి.
 
సినిమాలు, నేర కథనాల ప్రభావం
కౌమార దశ నుంచి యవ్వన దశలోకి ప్రవేశించే సమయంలో తాము చేసేది మంచో చెడో తెలుసుకోలేక పోతుంటారు. ఇదే సమయంలో సినిమాలు, నేర కథనాలను చూసిన యువత, విద్యార్థులు వాటిని అనుకరించడానికి యత్నిస్తుంటారు. ముఖ్యంగా సినిమాల లో టీనేజ్ ప్రేమను ఉద్దేశించినవే ఎక్కువగా వస్తున్నా యి. అందులోని అశ్లీలం, నేర సన్నివేశాలు యువత పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

ఇదే సమయం లో సినిమాలలో తనను ప్రేమించని అమ్మాయిలపై విలన్‌లు జరిపే దాడులు వారి మెదడులో నిండిపోతున్నాయి. నిజజీవితంలో తాము ప్రేమలో విఫలమయ్యామని గ్రహించి చాలామంది యువకులు అలాం టి నేర  ప్రవృత్తితో వ్యవహరిస్తున్నారు. జరిగిన ఘట నలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది.
 
సామాజిక స్పృహను కలిగించే బోధనలు చేయాలి

గతంలో యువత, విద్యార్థులు సమాజ శ్రేయస్సు కో సం తపించేవారు. సమాజాన్ని గురించి తెలుసుకునేవారు. పాశ్చాత్య పోకడలతో నేటి యువత త్వరగా దారి తప్పుతున్నారు. యువత, విద్యార్థులకు సామాజిక స్పృహ కలిగించే బోధనలు చేయాల్సిన అవసరం ఉంది. కెరీర్‌తో పాటు సమాజం గురించి వారికి అవగాహన కల్పించడం ద్వారా సరైన మార్గంలో నడపవ చ్చు. అలాంటి ప్రయత్నాలు విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీ తి, ధర్మం, న్యాయం, నాయకత్వ లక్షణాలు వంటి వి షయాలపై విద్యార్థులు, యువతకు అవగాహన క ల్పించాలి. తద్వారా వారు తప్పు చేయడానికి కొంత వరకు వెనుకడుగు వేస్తారు.
 
ఇటీవల జరిగిన ఘటలు
గతనెల 30న కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రేమించడం లేదన్న కోపంతో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అదే కళాశాల డిగ్రీ విద్యార్థి సాయికిరణ్‌రెడ్డి కత్తితో దాడిచేసి గాయపర్చాడు. అంతటితో ఆగకుండా తనూ పొడుచుకున్నాడు. సాయికిరణ్‌రెడ్డి ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు. సదరు విద్యార్థిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామానికి చెం దిన సునీల్‌రెడ్డి(17) అనే ఇంటర్ విద్యార్థి అదే గ్రా మానికి చెందిన విద్యార్థిని ఫొటోను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. బాధిత విద్యార్థిని ఫిర్యాదుతో సునీల్‌రెడ్డిపై పోలీసులు నిర్భయ, ఐటీ యాక్టు కింద కేసులు నమోదు చేసి ఈనెల 20న అరెస్టు చేశారు.
ఈ నెల 20న కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి (జి) గ్రామానికి చెందిన బాల్‌రాజు (20) అనే యువ కుడు, కామారెడ్డి పట్టణంలో ఓ యువతిని ఆటోలో ఎక్కించుకుని బలవంతంగా తీసుకెళుతుండగా స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు