మిస్సింగ్‌ కేసుల్లో ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ 

10 Aug, 2018 01:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అదృశ్యమైన చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఫేషియల్‌ రికగ్నైజేషన్‌(ఎఫ్‌ఆర్‌)ను వినియోగించుకోవాలని సీఐడీ భావిస్తోంది. యాదగిరిగుట్ట వ్యభిచార కూపంలోని చిన్నారులను రక్షించిన పోలీసులకు ఇప్పుడు వారిని తమ తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత పడింది.

ఆ చిన్నారుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది తల్లిదండ్రులు ముందుకొచ్చారు. అయితే ఎవరు ఎవరిబిడ్డో తేల్చలేని పరిస్థితి పోలీసులకు ఏర్ప డింది. దీంతో సీఐడీ దగ్గరున్న మిస్సింగ్‌ డేటాను ఎఫ్‌ఆర్‌ ద్వారా గుర్తించాలని సీఐడీ ఉమెన్‌ ప్రొటెక్షన్, చైల్డ్‌ రైట్‌ వింగ్‌ ప్రయత్నాలు చేస్తోంది. దీనితో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రెస్క్యూ అయిన చిన్నారుల తాజా ఫొటోలను తమ వద్ద ఉన్న సమాచారానికి పోలీసులు అనుసంధానిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు