తెప్పపై బైక్‌.. టికెట్‌ రూ.100

11 Aug, 2019 02:09 IST|Sakshi
తెప్పపై ద్విచక్ర వాహనం తీసుకువస్తున్న దృశ్యం

అర్వపల్లి: సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం–వంగమర్తి మధ్య మూసీనది కిలోమీటర్‌ మేర ప్రవహిస్తుంది. అయితే వర్షాలు రాని సమయాల్లో నదిలో నుంచి ఇసుకలోనే ఆ గ్రామాల మధ్య రాకపోకలు సాగిస్తారు.

ఇప్పుడు మూసీనది ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో స్థానికులు కొందరు తెప్పలు ఏర్పాటు చేసి నది అవతలి ఇవతలి వైపునకు ప్రయాణికులను దాటిస్తున్నారు. ఒక బైక్‌ను తెప్పపై తీసుకెళ్తే రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు