ఎవరికి కక్ష?

10 Oct, 2014 00:24 IST|Sakshi
ఎవరికి కక్ష?
  • ముస్తాఫా మృతితో విషాదం
  •  మెహిదీపట్నంలో ఉద్రిక్తత
  •  లాఠీ చార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
  • సాక్షి, సిటీబ్యూరో: అభం శుభం తెలియని బాలుడిపై ఎవరు కక్ష కట్టారు? ఆ కుర్రాడిపై ఎవరికి పగ ఉంటుంది? చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవీ ముస్తఫా మరణం రేకెత్తిస్తున్న ప్రశ్నలు. ఈ బాలుడి మృతిపై రకరకాల సందేహాలు వినిపిస్తున్నాయి. దీం తో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపులు జరిగాయా అనే కోణంలో నూ ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన మెహదీపట్నం మిల టరీ ఏరియాలోని  కేపీఎల్ అకామిడేషన్ క్యాం పస్ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

    మంటలతో కాలుతూ ముస్తఫా ఓ గదిలోంచి బయటికి పరుగెత్తుకుంటూ వచ్చి పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ గది ఎవరిది? ఆ గదిలో ఏమైనా అఘాయిత్యం జరిగిం దా? ఈ విషయం బయట పడుతుందనే భయంతో కావాలనే కిరోసిన్ పోసి ముస్తఫాను కాల్చి చంపాల నుకున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక అందితేగానీ లైంగిక దాడికి సంబంధించిన వాస్తవాలు వెలుగు చూడవని పోలీ సులంటున్నారు. బాలుని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అతని వల్ల ఎవరికైనా ప్రమాదం పొంచి ఉందా? లేక పెద్దలపై ఉన్న కక్షతో చిన్నారిని టార్గెట్ చేశారాఅనే కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు.
     
    ఇతరులు వచ్చే అవకాశమే లేదు

    ఆ ప్రాంతంలోకి ప్రయివేటు వ్యక్తులు వచ్చే అవకాశా లు లేవు. ఒకవేళ వచ్చినా 24 గంటలూ ఆర్మీ సిబ్బంది నిఘా ఉంటుంది. అనుక్షణం కాపలా కాస్తూ ఆయుధాలు ధరించిన సిబ్బంది ఉంటారు. భద్రతాపరంగా పూర్తి రక్షిత ప్రాంతంలోకి బయటి వ్యక్తులు వచ్చే ప్రసక్తే లేదని బస్తీవాసులు అభిప్రాయ పడుతున్నారు.
     
    నిందితులను గుర్తించడం కష్టమే

    ముస్తఫా హత్య కేసులో నిందితులను గుర్తించడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముస్తఫా ఇచ్చిన వాంగ్మూలంలో ఇద్దరు మిలటరీ డ్రెస్‌లో ఉన్న సిబ్బంది తనను కొట్టి, కిరోసిన్ పోసి కాల్చారని ఉందని నగర మేయర్ మాజిద్‌హుస్సేన్ పేర్కొన్నారు. వారి పేర్లను మాత్రం బాలుడు వెల్లడిం చలేదు. నిజానికి ఘాతుకానికి పాల్పడిన వారి పేర్లు ముస్తఫాకు తెలిసే అవకాశమూ లేదు. ఈ కేసులో నిజానిజాలు వెలుగు చూడాలంటే సైనికాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, సహకరిస్తేనే  నింది తులు చిక్కే అవకాశం ఉంది. సైనికాధికారుల సా యం లేకుండా నిందితులను పోలీసులు గుర్తించడం అసాధ్యమే. హుమాయూన్‌నగర్ పోలీసులు ముందు గా ఈ ఘటనపై హత్యాయత్నం (ఐపీసీ 307) కింద కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ ముస్తఫా గురువారం ఉదయం మృతి చెందడంతో హత్యాయత్నం కేసును హత్య (ఐపీసీ 302)గా మార్చారు.
     
    కేసును చేధిస్తాం..

    ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నామని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు ఉంటే ఇప్పటికే కేసు మిస్టరీ వీడేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిందితులను గుర్తించి తీరుతామని, ఇందుకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి కూడా పట్టుదలతో ఉన్నారని చెప్పారు. కేసు దర్యాప్తునకు సైనికాధికారుల సాయం తీసుకుంటామన్నారు. రికార్డు చేసిన ముస్తఫా వాంగ్మూలం అధికారికంగా పోలీసులకు ఇంకా చేరలేదని, మీడియాలో వ చ్చిన కథనాలను బట్టి ఆర్మీ సిబ్బందే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ముస్తఫా చెప్పినట్లు తెలుస్తోందన్నారు.
     
    రంగంలోకి ప్రత్యేక బృందాలు

    మెహిదీపట్నం: ముస్తాఫా హత్య కేసును చేధించేం దుకు డాగ్‌స్క్వాడ్‌తో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపినట్లు ఏసీపీ శ్రీనివాస్, హుమాయూన్‌నగర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు. సంఘటన స్థలంలో కిరోసిన్ తెచ్చిన ఖాళీ సీసా తప్ప ఇప్ప టి వరకు మరే ఆధారమూ దొరకలేదు. సంఘటన జరిగినప్పుడు బాలుడు ఒక్కడే ఉన్నాడా? మరికొంత మంది బాలురు ఉన్నారా? అనే కోణంలోనూ పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు పరిశోధనను వేగవంత చేసి, నిందితులను పట్టుకోవాలని ఘటనా స్థలాన్ని సంద ర్శించిన పోలీస్ కమిషనర్   మహేందర్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు ఈ ఘట నతో తమకు సంబంధం లేదని మిలటరీ వర్గాలు చెబుతున్నాయి.
     
    నిందితులను కఠినంగా శిక్షించాలి

    సాక్షి, సిటీబ్యూరో: ముస్తఫాను  కిరాతకంగా హతమార్చిన నిందితులను గుర్తించి, వెంటనే అరెస్టు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు పోలీసులకు డిమాండ్ చేశారు.
     
     

>
మరిన్ని వార్తలు