గ్రామీణ వికాస బ్యాంక్లో చోరీకి విఫలయత్నం

25 Oct, 2014 08:11 IST|Sakshi

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో గ్రామీణ వికాస బ్యాంక్లో చోరీకి విఫలయత్నం జరిగింది. శనివారం తెల్లవారుజామున దుండగులు చోరీకి యత్నించారు. బ్యాంకు కిటికీ పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. అయితే ఒక్కసారిగా  సైరన్ మోగటంతో వారు పరారయ్యారు. కాగా  బ్యాంక్ వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు