నగరంలో వృద్ధులే టార్గెట్‌..

11 Oct, 2017 16:31 IST|Sakshi

నకిలీ ఆయుర్వేదిక్‌ ముఠా అరెస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో నకిలీ ఆయుర్వేదిక్ మందులు తయారు చేస్తున్న ఓ ముఠాని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొత్తం 19 మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 2 లక్షల నగదుతో పాటు 24 సెల్‌ఫోన్లు, 11 బైకులను  సీజ్ చేశారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా వృద్ధులను టార్గెట్ చేసుకుని నకిలీ ఆయుర్వేదిక్ మందులను అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడైంది. సైఫాబాద్, సుల్తాన్ బజార్, అంబర్‌పేట్‌, ఎస్సార్ నగర్‌ల లో భారీగా నకిలీ ఆయుర్వేదిక్ మందుల అమ్మకాలు జరిపినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు