నకిలీ విత్తుకు నగరమే అడ్డా

7 Jul, 2017 01:24 IST|Sakshi
నకిలీ విత్తుకు నగరమే అడ్డా

► గుజరాత్‌ నుంచి హైదరాబాద్‌కు కావ్య పేరుతో నకిలీ విత్తనాలు తరలింపు
► నగరం కేంద్రంగా 3 జిల్లాల్లో విక్రయం
► ముగ్గురి అరెస్టు,రూ.20 లక్షల సరుకు స్వాధీనం


సాక్షి, హైదరాబాద్‌: నగరం కేంద్రంగా సాగుతున్న నకిలీ పత్తి విత్తనాల దందాకు నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెక్‌ చెప్పారు. గుజరాత్‌లో తయారవు తు న్న వీటిని హైదరాబాద్‌ నుంచి మూడు జిల్లాల్లో విక్ర యిస్తున్నట్లు గుర్తించారు. డిస్ట్రిబ్యూషన్‌ నిర్వహిస్తు న్న ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.20 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి గురువారం వెల్లడించారు.  ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నా మన్నారు.

రాజస్తాన్‌ నుంచి వచ్చి నగరంలో దందా...
రాజస్తాన్‌కు చెందిన భరత్‌ పటేల్‌ సికింద్రాబాద్‌లోని హైదర్‌బస్తీలో ‘మహావీర్‌ ట్రేడర్స్‌’ పేరుతో సంస్థ ఏర్పాటు చేశాడు. 6 నెలలుగా గుజరాత్‌ నుంచి ‘కావ్య’ బ్రాండ్‌ పేరుతో ఉన్న నకిలీ పత్తి విత్తనాలను తీసుకువస్తున్నాడు. గాంధీనగర్‌ బన్సీలాల్‌పేటలో ఓ గోదాము ఏర్పాటు చేసి.. గుజరాత్‌కు చెందిన పటేల్‌ అమిత్‌కుమార్‌ చంద్రకాంత్, హార్ధిక్‌ పటేల్, వినయ్‌ ఆర్‌.షాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాడు. వ్యవసాయ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా  ‘కావ్య’ బ్రాండ్‌ పత్తి విత్తనాలను వీరు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లోని దుకాణాల ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు.

తక్కువ ధరతో రైతులకు ఎర...
450 గ్రాముల బరువుతో ఉన్న ఆకర్షణీయమైన ప్యాకె ట్లు, విడిగా కేజీల లెక్కన విత్తనాలు అమ్ముతున్నారు. ఈ ప్యాకెట్లపై ధర, తయారీ తేదీ తదితర వివరాలేవీ లేవు. ప్రభుత్వ సబ్సిడీ పత్తి విత్తనాల ధర 450 గ్రాములు రూ.800 వరకు ఉండగా.. రూ.200 నుంచి రూ.250కు వీరు అమ్ము తున్నారు.  

ముగ్గురి అరెస్టు.. : దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.బల్వంతయ్య బృందం వ్యవసాయ శాఖ అధికా రులతో కలిసి దాడి చేసి భరత్‌ పటేల్‌ మినహా మిగిలిన ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షల విలువైన 1,250 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విత్తనాలు మొలకెత్తకపోవడంతో మళ్లీ వేరే విత్తనాలు నాటాల్సి వచ్చిందని కరీంనగర్‌ రైతులు వాపోయారు.

బీఎన్‌రెడ్డినగర్‌లో మరొకరి అరెస్టు..
హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డినగర్‌లో వివిధ రకాల నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఎంఈ శివారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఇతడు బీఎన్‌రెడ్డినగర్, ఎస్‌కేటీనగర్‌లలో కార్యాల యాలు ఏర్పాటు చేసుకుని వివిధ కంపెనీలకు చెందిన కూరగాయలు, పత్తి తదితర విత్తనాలను అనుమతి లేకుండా మిక్సింగ్, ప్రాసెసింగ్‌ చేస్తూ విక్రయిస్తున్నాడు.

పక్కా సమాచారంతో గురు వారం అతడిని అరెస్టు చేసి, రూ.27.86 లక్షల విలువైన నకిలీ విత్తనాల బ్యాగ్‌లు, మిక్సింగ్, ప్రాసెసింగ్‌ మిషన్లు స్వాధీనం చేసుకున్నట్టు రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించి నట్టు చెప్పారు. గత నెలలో అత్తాపూర్‌ ఏజీ కాలనీలో అగ్రిబయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో దందా నిర్వహిస్తున్న శివారెడ్డిని శంషా బాద్‌ పోలీసులు అరెస్టు చేశారని, బయటకొచ్చిన తరువాత మకాం మార్చి మళ్లీ నకిలీ విత్తనాల వ్యాపారం మొదలుపెట్టాడని వెల్లడించారు.

మరిన్ని వార్తలు