చేసింది నర్సు.. చేసేది వైద్యం...

21 Aug, 2015 02:59 IST|Sakshi
చేసింది నర్సు.. చేసేది వైద్యం...

 చెన్నూర్ : వైద్యో నారాయణ హరి.. అన్నది నానుడి. ఇలా దేవతల స్థానమిచ్చే వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించిన మహిళ ఉదంతమిది. కొంతకాలం నర్సు వృత్తిలో కొనసాగిన ఆమె ఏకంగా ఎంబీబీఎస్, ఎంఎస్ నకిలీ సర్టిఫికెట్, తప్పుడు రిజి ష్టర్ నంబర్‌తో వైద్యురాలి అవతారమెత్తింది. అరుుతే, ఆంధ్రప్రదేశ్ రాస్ట్రానికి చెందిన ఆమె తమ ప్రాంతంలో ఇదంతా చేస్తే బయటపడుతుందని భావించిందో ఏమో కానీ ఆదిలాబాద్ జిల్లాలో ‘సేవలు’ అందిస్తోంది. ఈక్రమంలో ఆమె రాస్తున్న మందుల స్థారుుపై అనుమానమొచ్చిన ఆస్పత్రి యూజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం నకిలీ ఉదంతం వెలుగుచూసింది.

 కన్సల్టెన్సీ ద్వారా నియూమకం
 చెన్నూరులోని అస్నాద రోడ్డులో 15 మే 2015న కొత్తగా నర్సింగ్ హోంను పారంభించారు. ఈ ఆస్పత్రికి స్త్రీల ప్రత్యేక నిపుణురాలు కావాల్సి ఉండగా హైదరాబాద్‌లోని ఆర్కట్ మెడికల్ కన్సల్టెన్సీని సంప్రదించారు. దీంతో వారు గుంటూరుకు చెందిన డాక్టర్ నాగమణి చెన్ను(ఎంఎస్) పేరు సూచించగా, ఆమె రూ.1.75లక్షల వార్షిక వేతనంతో విధుల్లో చేరింది. అరుుతే, ఆస్పత్రిలో చేరిన నాగమణి రోగులు, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడాన్ని యూజమాన్యం గుర్తించింది.

అలాగే, ఆమె రాస్తున్న మందులపై కూడా అనుమానమొచ్చింది. దీంతో అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఫిజీషియన్.. నాగమణి రాస్తున్న మందుల చీటీలను కొన్ని రోజుల పాటు పరిశీలించి అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి వర్గాలు విచారణ జరపగా ఆమె సర్టిఫికెట్(రిజిస్ట్రేషన్ నంబర్ 65699)పై కూడా అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వైద్యురాలను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ఇందులో భాగంగా నాగమణి చెన్ను స్వగ్రామమైన విజయవాడకు వెళ్లి విచారణ చేపట్టారు. కాగా, గుంటూరులో నాగమణి చెన్ను పేరిట ఓ ప్రముఖ వైద్యురాలు ఉండగా.. ప్రస్తుత నకిలీ వైద్యురాలు నాగమణి గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసినట్లు సమాచారం. ఈ విషయమై చెన్నూరులోని నర్సింగ్ హోం నిర్వాహకుడు సుభాష్ మాట్లాడుతూ నాగమణి వ్యవహరిస్తున్న తీరు, రాస్తున్న మందులపై అనుమానం రావడంతో ఆమె వల్ల రోగులకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

 లోతుగా విచారణ
 చెన్నూరులో నకిలీ వైద్యురాలి లీల బయటపడడం తో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదే ఘట న కాకుండా జిల్లావ్యాప్తంగా ఇంకా ఎవరైనా నకిలీ వైద్యులు ఉన్నారా అనే కోణంలో వారు విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగమణిని అదుపులోకి తీసుకున్నట్లు చెన్నూరు ఎస్సై చందర్ వెల్లడించారు. దీనికి సంబంధించి మంచిర్యాల ఏ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ సాగుతోందని ఆయన వివరించారు.   

మరిన్ని వార్తలు