ఆశపడితే అసలుకే మోసం..

12 Aug, 2015 04:18 IST|Sakshi
ఆశపడితే అసలుకే మోసం..

♦ నకిలీ బంగారు కడ్డీలు ఎరవేసి
♦ అసలు బంగారం దోచుకుంటున్న మహిళలు
ధర్మపురిలో యథేచ్ఛగా సంచారం
 
 నకిలీ బంగారు కడ్డీలను ఎరవేసి అసలు బంగారం ఎత్తుకుపోతున్న సంఘటనలు ధర్మపురిలో తరచూ జరుగుతున్నారుు. మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు మహిళా దొంగలు. ధర్మపురి పుణ్యక్షేత్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ప్రతి శనివారం ఇక్కడ సంత జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారిలో ఎవరైనా మహిళలు అమాయకంగా కనిపిస్తే చాలు.. వారిని బురిడీ కొట్టించి అసలు బంగారం ఎత్తుకెళ్తున్నారు. గతంలో ఇలాంటి మోసాలకు పాల్పతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా నాలుగు రోజుల క్రితం ధర్మపురికి చెందిన ఓ అవ్వను మోసం చేసి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 
-ధర్మపురి
 
 ఇదీ మోసం చేసే విధానం..
 మహిళా దొంగలు ఇద్దరు, ముగ్గురు కలిసి జట్టుగా ఏర్పడతారు. పథకం ప్రకారం ముందుగా పరిసర ప్రాంతాలను పరిశీలించి ఒంటరిగా మహిళలు దొరికే ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఒంటిపై నగలు ఉన్న అమాయకులను ఎంచుకుని అనుసరిస్తారు. వారి పక్కనుంచే వెళ్లి వెంట తెచ్చుకున్న బంగారం పూత ఉన్న కడ్డీని కింద జారవిడుస్తారు. తర్వాత వారే ఆ కడ్డీని చేతికి తీసుకుని ఇది నీదేనా.. మరెవరైనా పడేసుకున్నారా.. అంటూ మాటల్లో దింపి ఎవరైనా చూస్తే బాగుండదు.. ఈకడ్డీని నీవే తీసికో.. పది తులాల వరకు ఉంటుంది. దానికి బదులు నీమెడలో ఉన్న కొద్దిపాటి నగలు ఇస్తే సరిపోతుందని చెబుతారు. అత్యాశతో కొంత మంది ఒంటిమీదున్న నగలిచ్చి మోసపోరుున సంఘటనలు ధర్మపురిలో తరుచుగా జరుగుతున్నారుు.
 
 గతంలో దొరికిన ముఠా
  ఇంతకు ముందు ఇక్కడ సీఐగా పనిచేసిన మహేందర్ ఆధ్వర్యంలో బంగారు కడ్డీల పేరుతో మోసం చేస్తున్న ముఠాను పట్టుకుని మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో హైదరాబాద్‌లోని ఫత్తే నగర్‌కు చెందిన గుంజ శ్రీనివాస్‌తోపాటు అతడి భార్య ప్రమీల, మరో మహిళ కొమిరె రేణుక, మరో ఐదుగురు ఉన్నారు. జామీనుపై బయటకు వచ్చిన ఈ మూఠానే మళ్లీ మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.
 
జరిగిన సంఘటనలు
►2012 ఫిబ్రవరి 25న జగిత్యాలకు చెం దిన అత్తె రాజవ్వ నుంచి రెండు తులా ల బంగారు పుస్తెలతాడు తీసుకెళ్లారు.
►2012 నవంబర్ 24న ఆదిలాబాద్ జిల్లాలోని దండెపెల్లికి చెందిన గాజుల రాజవ్వ రెండున్నర తులాల పుస్తెల తాడు, వెండి పట్టాగొలుసులు అపహరించారు.
►2015 అగస్టు 1న ధర్మపురికి చెందిన మాదాసు నర్సవ్వ నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
 
 మూడున్నర తులాలు మోసపోరుున

 మాది ధర్మపురిలోని కాశెట్టివాడ. ఈనెల ఒకటో తారీఖున శనివారం ఇక్కడ సంతల కూరగాయలు కొనుక్కొని ఇంటికి పోతున్న. నా పక్కనుంచి వచ్చిన ఇద్దరు ఆడోళ్లు ఆగి కిందినుంచి బంగారు కడ్డీ తీసి అబ్బ దొరికిందే.. బరువు బాగనే ఉన్నది. నీదేనా.. అని మాటల్ల దింపిండ్లు. నీమీదున్న నగలు ఇచ్చి బంగారు కడ్డీ తసుకొనిపో.. ఎవలైన సూత్తరని చెప్పిండ్లు. నమ్మి అది తీసుకొని ఇంటికి పోరుు చూసుకునే సరికి నకిలీదని తెలిసింది. మూడున్నర తులాల నగలు పోరుునరుు. పోలీసులకు చెప్పిన.
 - మాదాసు నర్సవ్వ, ధర్మపురి
 
 బంధువుల ఇంటికి పోతే..
 ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి చుట్టపుచూపుగా 2012 నవంబర్ 11న వచ్చిన. కూరగాయలు కొనుక్కుని తిరిగి వస్తుండగా ముగ్గురు మహిళలు బంగారు కడ్డీ దొరికిందని చెప్పిండ్లు. ఇది పది తులాలుంటది. ఇది తీసికొని నీ ఒంటిమీదున్న పుస్తెలతాడు ఇరుు్వమని తొందరపెట్టిండ్లు. ఏంచెయ్యూల్నో తోచక రెండున్నర తులాల పుస్తెలతాడు తీసిచ్చిన. ఆ కడ్డీ నాచేతుల పెట్టి పోరుుండ్లు. అవుసులారుున దగ్గరికి పోరుు చూపించిన. బంగారం కాదని చెప్పిండు.
 - గాజుల రాజవ్వ, దండెపెల్లి, ఆదిలాబాద్ జిల్లా

మరిన్ని వార్తలు