ఆర్టీసీకి నకిలీ నోట్ల బెడద 

27 Apr, 2019 12:59 IST|Sakshi

ఇబ్రహీంపట్నం: ఆర్టీసీని నకిలీ నోట్ల బెడద వెంటాడుతోంది. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్సుల్లో ఈ నోట్ల చలామణి ఎక్కువగా జరుగుతోంది. సంతరోజైన బుధవారం జనాల రద్దీ మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది. బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉంటారు. ఇదే అదనుగా భావించి కేటుగాళ్లు కండక్టర్లకు నకిలీనోట్లు ఇస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో నోట్లను సరిగా గమనించని కండక్టర్లు వారికి టికెట్లను ఇచ్చి తిరిగి చిల్లర డబ్బులను ఇస్తున్నారు.

డ్యూటీ దిగి డిపోలోని క్యాష్‌ కౌంటర్‌లో డబ్బులను కండక్టర్లు ముట్టజెప్పి వెళ్తున్నారు. ఆ తర్వాత డిపో క్యాష్‌ క్లర్క్‌ డబ్బులను లెక్కించే క్రమంలో ఈ నకిలీ నోట్లు  బయటపడుతున్నాయి. బుధ, గురువారల్లో ఈ నోట్ల అధికంగా వస్తున్నట్లు డిపో అధికారి ఒకరు తెలిపారు. ఒకే సిరీస్‌ నంబర్‌తో మూడు నాలుగు నోట్లు  వచ్చినట్లు చెప్పారు.  అదేవిధంగా రద్దీగా ఉండే పాన్‌షాపుల్లో కూడా ఈ నోట్లు వస్తున్నట్లు ఓ యాజమాని తెలిపారు. ఓరిజనల్‌ నోట్లను పోలీనట్లుగానే ఉండటంతో ఈ నోట్లను వెంటనే గుర్తించడం ఇబ్బందిగా మారింది.   

నకిలీనోట్లు వస్తున్నాయి   
ఆర్టీసీ బస్సుల్లో నకిలీ నోట్లు వస్తున్నాయి. రద్దీగా ఉండే బస్సుల్లోనే దుండగులు నకిలీ నోట్లను విడిపిస్తున్నారు. బుధ, గురువారల్లో ఇవి ఎక్కువ వస్తున్నాయి. క్యాష్‌ కౌంటింగ్‌ మిషన్‌కు కూడా ఈ నోట్లు చిక్కడం లేదు. బ్యాంకుకు వెళ్తే ఫెక్‌ నోట్‌ అంటూ చెబుతున్నారు.  – యాదయ్య, ఆర్టీసీ డిపో క్లర్కు   

మరిన్ని వార్తలు