నకి'లీలలు!

31 Aug, 2015 03:24 IST|Sakshi
నకి'లీలలు!

సహకార శాఖలో ఇంటి దొంగల గుట్టు రట్టయింది. ఓ ఆడిటర్ తన అధికారాన్ని చెలాయించి అక్రమంగా రుణాలు కాజేసిన బాగోతం బయటపడింది. ఇందుకు శాఖలోని మరి కొందరి ‘సహకారం’ కూడా తోడయింది. వెరసి,, తన పేరుతో పాటు కుటుంబసభ్యుల పేరున కూడా నకిలీ పట్టాపాస్‌పుస్తకాలు పెట్టి పెద్ద మొత్తం రుణాల పేరుతో కాజేసిన విషయం వెలుగుచూ సింది. ఇంత జరిగినా అతడిపై వేటు వేయాల్సిన ఉన్నతాధికారులు కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
- దొంగ పట్టాలు... ఆపై రుణాలు..
- తనతోపాటు కుటుంబసభ్యుల పేరిటా లోన్లు
- బినామీ పేర్లతో రూ. కోటి వరకు స్వాహా
- సహకార శాఖ ఆడిటర్ అవినీతి బాగోతం
- అక్రమాలు వాస్తవమేనంటున్న డీసీఓ
నిజామాబాద్ అర్బన్ :
జిల్లా సహకార శాఖలో అవినీతి పర్వం జోరుగా సాగుతోంది. సహకార శాఖలోని ఆడిటర్ బోగస్ పట్టాలతో లక్షలాది రూపాయల రుణాలు పొందారు. ప్రభుత్వ ఉద్యోగి అయిఉండి, అదే శాఖలో తనతో పాటు కుటుంబసభ్యుల పేర్లతోనూ నకిలీ పట్టాలు సృష్టించి లోన్ తీసుకున్నారు. ఇలా మొత్తం రూ. కోటి వరకు లోన్‌ల రూపంలో కాజేశారనే ఆరోపణలున్నారుు.
 
ఇలా జరిగింది...
జిల్లా సహకార శాఖలో సుమారు పదేళ్లకు పైబడి ఆడిటర్‌గా అంబర్‌సింగ్ కొనసాగుతున్నాడు. ఇతను తన పేరున, మరో ముగ్గు రు కుటుంబసభ్యుల పేర్లపై నకిలీ పట్టాలు సమర్పించి లోన్ తీసుకున్నాడు. మాక్లూర్, కమ్మర్‌పల్లి మండలం కొనసముందర్ ప్రాథమిక సహకార సంఘాలలో అక్రమంగా రుణాలు పొందాడు. ఇతను ఆడిటర్‌గా ప్రాథమిక సహకార సంఘాల అకౌంట్ వ్యవహారాలను పరిశీలించేవారు. దీంతో అందులోని లొసుగులను బయటకు తీసి మాక్లూర్, కొనసముందర్ సహకార సంఘాల సెక్రటరీలను బెదిరించాడు. తనకు సహకార సంఘాలలో రుణ ం కావాలని, దీనికి సంబంధించిన దరఖాస్తులు, పాస్‌పుస్తకాలను అందిస్తానని చెప్పాడు.

అదే శాఖలో ఉద్యోగి అరుునందన లోన్ ఇవ్వలేమని కార్యదర్శులు వ్యతిరేకించగా.. ‘ఆడిట్‌లో మీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చారుు’ అంటూ   భయపెట్టడంతో వారు కూడా అతడికి సహకరించారు. కొనసముంద ర్ సొసైటీలో రూ.2.50 లక్షలు, మాక్లూర్ సహకార సంఘంలో రూ.4 లక్షలు, అమ్రాద్ సహకార సంఘంలో రూ.1.50 లక్షలు రుణ ం తీసుకున్నాడు. అతడికి ఏ మాత్రం భూమి లేకున్నా.. తన పేరున, కుటుంబసభ్యుల పేరున అక్రమ పట్టాలు సృష్టించాడు. వీఆర్‌వో, తహశీల్దార్, ఆర్డీవోల సంతకాలు ఫోర్జరీ చేశాడు. తనకు అనుకూలంగా ఉన్న సహకార సంఘాల్లో ఈ పత్రాలు పెట్టి రుణం తీసుకున్నాడు. మాక్లూర్ మండలం అమ్రాద్ సహకార సంఘంలో బినామీ పేర్లు, నకిలీ పట్టాలతో రూ.50 లక్షల వరకు వివిధ పేర్లపై రుణాలు పొందారు. నిజామాబాద్ మండలం మంచిప్ప సహకార సంఘంలో నకిలీ పట్టాలతో రుణ ం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు కాలేదు. అలాగే వర్ని, రేంజల్, నందిపేట, నవీపేట, కమ్మర్‌పల్లి, మాక్లూర్, ఎడపల్లి మండలాల్లో నకిలీ పట్టాలతో బినామీ పేర్లమీద మరికొందరు రుణాలు తీసుకున్నారు.
 
వెలుగులోకి వచ్చిందిలా..
కమ్మర్‌పల్లి మండలం కోనసముందర్ సొసైటీ చెర్మైన్ నకిలీ పట్టాల వ్యవహారాన్ని గుర్తించారు. పట్టా పాస్‌పుస్తకాలు కొత్తగా ఉండటం, సంతకాల్లో తేడా ఉండటంతో అనుమానం వచ్చి పరిశీలించారు.
 
దీంతో ఆడిటర్‌కు సంబంధించిన రుణాల వివరాలను తనీఖీ చేశారు. అరుుతే ఇదంతా 20 రోజుల క్రితమే జరిగినప్పటికీ బయటకు రానీయకుండా ఆడిటర్ తీసుకున్న రూ.2.50 లక్షల రికవరీ చేరుుంచారు. మాక్లూర్ మండలం అమ్రాద్ సహకార సంఘంలో రుణాలు పొందిన లబ్దిదారుల పట్టాలను చైర్మన్ పరిశీలించగా నకిలీ పట్టాపాస్ పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రుణాలు పొందిన జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించగా సుమారు రూ.50 లక్షల వరకు నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్లు తేలింది. ఈ వ్యవహారంపై చైర్మన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.
 
హుటాహుటిన బదిలీ..!
నకిలీ పట్టాపాస్‌పుస్తకాలతో రుణాలు పొందిన ఆడిటర్‌ను జిల్లా సహకార శాఖ అధికారి శ్రీహరి రెండు రోజుల క్రితమే బదిలీ చేశారు. జిల్లా కేంద్ర సహకార శాఖ కార్యాలయంలో ఆడిటర్‌గా ఉన్న ఆయనను బోధన్ సహకార శాఖ పరిపాలన కార్యాలయానికి పంపించారు. కాగా, ఆడిటర్ అక్రమాలపై అధికారులకు ముందే తెలిసినా పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ఉద్యోగి అయి ఉండి సొంత శాఖలోనే సెక్రటరీలను బెదిరించి నకిలీ పట్టాలతో రుణాలు పొందడంపై జిల్లాస్థాయి అధికారులు పెదవివిప్పడం లేదు. ఆడిటర్‌కు సంబంధిత యూనియన్ నేతలు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదని ఓ నాయకుడు చెప్పారు. ఈ వ్యవహారంపై అధికారులు సైతం గత ఏడాదిన్నర కాలంగా వ్యవహారంపై ఎందుకు స్పందించలేదనే అనుమానాలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు