నకిలీ విలేకరుల అరెస్టు

5 Mar, 2015 03:00 IST|Sakshi

ఖమ్మం రూరల్: టీవీ చానల్స్ విలేకరులమని చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన ఇద్దరిని ఖమ్మం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం డీఎస్పీ దక్షిణా మూర్తి విలేకరులతో తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. ఖమ్మంలోని సారథి నగర్ జూబ్లిపురాకు చెందిన బట్టా నాగరాజు, బుర్హన్‌పురానికి  చెందిన సంతులూరి వంశీ  కలిసి బుధవారం ఉదయం కోదాడ క్రాస్ రోడ్డు వద్ద లారీలను ఆపుతూ డ్రైవర్ల వద్ద నుంచి డబ్బులను వసూలు చేశారు. మేం విలేకరులం.. మీ లారీల్లో దొంగ సరుకు వెళ్తోంది.

ఆర్‌టీఓ కు సమాచారం అందిస్తామని బెదిరిస్తూ పలువురు డ్రైవర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలో ఓ లారీ డ్రైవర్ వీరితో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న రూరల్ ఎస్సె లక్షీనారాయణ వీరిని గమనించి ఆరా తీయగా లారీ డ్రైవర్ విషయూన్ని తెలిపాడు. దీంతో వంశీ, నాగరాజులను అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్టేషన్‌కు తరలించారు.

నిందితుల వద్ద నుంచి రూ.2 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో వంశీకి ప్రభుత్వం నుంచి విలేకరులకు ఇచ్చే అక్రిడిటేషన్ కార్డు ఉండగా, నాగరాజు  ప్రారంభం కానున్న ఓ టీవీ చానల్ పేరిటి స్వయంగా  గుర్తింపు కార్డును తయూరు చేసుకున్నాడు. డీఎస్పీ మాట్లాడుతూ అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్ లేదా 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. ఎవరైనా విలేకరుల మని, లేదా పోలీసులమని చెప్పి వివరాలు అడిగితే గుర్తింపు కార్డులు చూపించాలని కోరాలని సూచించారు. విలేఖరుల సమావేశంలో సీఐ ఆంనేయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు