ఫ్యాన్సీ.. సీరియల్‌.. సేమ్‌!

13 Dec, 2018 09:41 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల ఓట్లలో ఎన్నో చిత్రాలు

కొందరికి ‘ఫ్యాన్సీ నంబర్‌’తో కూడినవి

మరికొందిరికి సీరియల్‌గా వచ్చిన వైనం

ఇంకొందరికి ఒకే సంఖ్యలో పడిన ఓట్లు

సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో అనేక చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఫ్యాన్సీ నెంబర్లతో కూడిన ఓట్లు వచ్చాయి. మరికొందరికి ఆరోహణ, అవరోహణ క్రమాల్లో సీరియల్‌గా వచ్చినట్లు తేలింది. ఒకే సంఖ్యలో ఓట్లు వచ్చిన అభ్యర్థులు సైతం ఉన్నారు. ఈ మూడు కేటగిరీలకు చెందిన వారిలో అత్యధికులు చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లే ఉన్నారు. ఆయా

నియోజకవర్గాల వారీగా ఇలా..
ఖైరతాబాద్‌: బీజేపీ తరఫున పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డికి 34,666 ఓట్లు వచ్చాయి. జాతీయ మహిళా పార్టీ అభ్యర్థిని దాన లక్ష్మికి 99 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి కె.నవీన్‌కుమార్‌కు 77 ఓట్లు, న్యూ ఇండియా పార్టీకి చెందిన అమృత్‌రాజ్‌కు 66 ఓట్లు వచ్చాయి.  

కార్వాన్‌: బీఎస్పీ అభ్యర్థి సయ్యద్‌ రహిముద్దీన్‌కు 363, తెలంగాణ ఇంటి పార్టీకి చెందిన నర్సింగ్‌రావుకు 200 ఓట్లు వచ్చాయి. అలానే సోషలిస్ట్‌ పార్టీకి చెందిన సార్వత్‌కు 155, లోక్‌ తాంత్రిక్‌ సర్వజన్‌ సమాజ్‌ పార్టీకి చెందిన ఖతీజాకు 154 చొప్పున పోలయ్యాయి.  

ఎల్బీనగర్‌: ఇండిపెండెంట్లు జగన్‌మోహన్‌ పోలే, అనుగు సాయికృష్ణలకు 74, 73 చొప్పున, రాంబాబురెడ్డి, ప్రవీణ్‌గౌడ్‌లకు 61, 60 చొప్పున, దేవ, శ్రీనివాసాచారిలకు 59 చొప్పున ఓట్లు వచ్చాయి.

మలక్‌పేట: అన్నా వైఎస్‌ఆర్‌ సీపీ తరఫున పోటీ చేసిన సయ్యద్‌ అన్వర్, బహుజన లెఫ్ట్‌ పార్టీ అభ్యర్థి వెంకట రమణలకు 118, 117 ఓట్లు, ఆప్‌ అభ్యర్థి చిన్న లింగానికి 100, ఇండిపెండెంట్లు గోపాల్, రమేష్‌లకు 80 చొప్పున ఓట్లు వచ్చాయి.  

మేడ్చల్‌: స్వర్ణ్‌ భారత్‌ పార్టీ, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థులు రాహుల్‌ పండిట్, దుర్గా ప్రసాద్‌లకు 140 చొప్పున, ఇండిపెండెంట్లు వేద్, నారాయణలకు 137, 136 ఓట్లు, దీపక్, కాంతారెడ్డిలకు 134, 133 చొప్పున, సతీష్‌కుమార్‌కు 100 ఓట్లు నమోదయ్యాయి.  

ముషీరాబాద్‌: యువ పార్టీ, ఇండియా ప్రజా బంధు పార్టీలకు చెందిన చందు, రాజ్‌కుమార్‌లకు 147, 146, అన్నా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఫాతిమా భానుకు 100, న్యూ ఇండియా పార్టీకి చెందిన మహబూబ్‌ అలీకి 77, బహుజన రాష్ట్ర సమితి, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్, నాగేందర్‌లకు 76 ఓట్లు చొప్పున వచ్చాయి. ఇండిపెండెంట్‌ సోమయాజులు, జన వాహిని పార్టీ అభ్యర్థి నవాబ్‌లకు 53 ఓట్ల చొప్పున వచ్చాయి.  

నాంపల్లి: బీజేపీ అభ్యర్థి డి.కరుణాకర్‌కు 11,622 ఓట్లు పడ్డాయి. సీపీఐఎం అభ్యర్థి లక్ష్మీకుమార్‌కు 400, ఇండిపెండెంట్‌ అజీమ్‌కు 88, స్వతంత్ర అభ్యర్థులు సంతోష్, యూసుఫ్‌లకు 82 చొప్పున ఓట్లు నమోదయ్యాయి.  

కుత్బుల్లాపూర్‌: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వివేకానంద్‌కు 1,54,500 ఓట్లు, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీశైలం గౌడ్‌కు 1,13000 ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్‌లు బిక్షపతికి 727, భూపాల్, రాములుకు 338, 337 చొప్పున, మరో స్వతంత్ర అభ్యర్థి రాఘవకు 101 ఓట్లు లెక్క తేలాయి.  

సనత్‌నగర్‌: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు 66464 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్‌ దేవేందర్‌కు 200, బహుజన రాష్ట్ర సమితి అభ్యర్థి అశోక్‌ కుమార్‌కు 66 ఓట్లు వచ్చాయి.  

సికింద్రాబాద్‌: సీపీఐఎం అభ్యర్థి అనిల్‌కుమార్‌కు 555, ఇండిపెండెంట్‌ రజనికి 444, మోహన్‌కు 232, అంబేడ్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎస్‌ఆర్‌కు 88 చొప్పున ఓట్లు నమోదయ్యాయి.  

కంటోన్మెంట్‌: స్వతంత్ర అభ్యర్థి బి.రాజుకు 88 ఓట్లు పడ్డాయి.  

శేరిలింగంపల్లి: శివసేన, అన్నా వైఎస్సార్‌ సీపీల తరఫున పోటీ చేసిన కేశవులు ఖాలీద్‌లకు 212 చొప్పున, దళిత్‌ బహుజన్‌ పార్టీ అభ్యర్థి కల్పన, ఇండిపెండెంట్‌ శివప్రసాద్‌లకు 211 చొప్పున, అంబేడ్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నాగరాజుకు 151 ఓట్లు వచ్చాయి.

ఉప్పల్‌: బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థి వై.పరమేశ్వర్‌కు 1211, ది ఫ్యూచర్‌ ఇండియా పార్టీ అభ్యర్థి అనిల్‌కు 343 వచ్చాయి. ఆలిండియా సమత పార్టీకి చెందిన ప్రకాష్, ఇండిపెండెంట్‌ మహేందర్‌ కుమార్‌లకు 114 చొప్పున, న్యూ ఇండియా పార్టీ, జై మహాభారత్‌ పార్టీల అభ్యర్థులు బాలరాజు, యుగంధర్‌లకు 106 చొప్పున ఓట్లు పడ్డాయి.  

యాకుత్‌పురా: ఎంబీటీ అభ్యర్థి ఫర్హత్‌ ఖాన్‌కు 21222 ఓట్లు, శివసేన అభ్యర్థి మహేష్‌కుమార్‌కు 323 ఓట్లు, ఎంసీపీఐ అభ్యర్థి హాజీ పాషాకు 131, తెలంగాణ లేబర్‌ పార్టీ అభ్యర్థి ఉస్మాన్‌కు 121, ఇండిపెండెంట్‌ సుదర్శన్‌కు 99 నమోదయ్యాయి.  

గోషామహల్‌: అఖిల భారతీయ ముస్లిం లీగ్, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థులు ఖాజా ఖాన్, రాజులకు 103, 102 చొప్పున, అంబేడ్కర్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థి అభిమన్యు యాదవ్‌కు 99, వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి రియాజుద్దీన్‌కు 88 ఓట్లు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు