కాబోయే హిమాచల్‌ సీజేకు వీడ్కోలు 

21 Jun, 2019 03:34 IST|Sakshi
జస్టిస్‌ రామసుబ్రమణియన్‌కు జ్ఞాపికను అందజేస్తున్న దృశ్యం

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌కు హైకోర్టు గురువారం ఘనం గా వీడ్కోలు పలికింది. మొదటి కోర్టు హాల్లో జరిగిన వీడ్కోలు సభకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ అధ్యక్ష త వహించారు. జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ను పదోన్నతిపై హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. కేసుల్ని సత్వరంగా పరిష్కరించడంలో, విభి న్న కేసుల్లో ఆయన అందించిన న్యాయసేవల్ని జస్టిస్‌ చౌహాన్‌ కొనియాడారు.

ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుంచి హైకోర్టులో న్యాయవాదు లు, సిబ్బంది అందించిన సహకారానికి జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, పలువురు న్యాయవాదులు, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ భార్య సరస్వతి, కుమారుడు దర్శన్, కోర్టు సిబ్బంది హాజరయ్యారు. ఈ బదిలీతో హైకోర్టులో ఏసీజేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 11కు తగ్గింది. 13 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో కూడా జస్టిస్‌ రామసుబ్రమణియన్‌కు న్యాయవాదులు జ్ఞాపికను అందజేసి వీడ్కోలు పలికారు. ఇదిలా ఉండగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చౌహాన్‌తో గవర్నర్‌ నరసింహన్‌ 22న ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

మరిన్ని వార్తలు