విద్యుదాఘాతంతో రైతు మృతి

14 Jul, 2018 13:30 IST|Sakshi
పిచ్చిరెడ్డి మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు 

మోత్కూరు(తుంగతుర్తి) : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో శుక్రవారం మ« ద్యాహ్నం జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెం దిన రైతు మోతె పిచ్చిరెడ్డి (62) మోత్కూరు–తిరుమలగిరి మెయిన్‌ రోడ్డు పక్కన గల తన వ్యవసాయ బావి వద్ద కొత్త ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నాడు.

అందులో భాగంగా పునాదిని మొ రంతో నింపుతుండగా ట్రాక్టర్‌ వచ్చే క్రమంలో ఒక చేతిలో ఇనుప చువ్వ పట్టుకుని.. మరోచేతితో సర్వీస్‌ వైరు పక్కకు జరుపుతుండగా దాని వెంట ఉన్న జే వైరుకు కరెంట్‌ సరఫరా జరిగి అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య యశోద, వివాహమైన ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

ఊహించ ని సంఘటన జరగడంతో మృతుడి కుటంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను కలిచివేశాయి. పోలీసులు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు