విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

25 Feb, 2016 00:24 IST|Sakshi

మద్దూరు : పొలం వద్ద ఉన్న ఎస్‌ఎస్-3 ట్రాన్స్‌ఫార్మర్ ఏబీ స్విచ్ ఆఫ్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గరై రైతు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా మద్దూరు మండలం మర్మాముల శివారు బంజరలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వేచరేణి యాదగిరి (45) తన పొలంలో వరి సాగు చేసాడు. ఈ వారం రాత్రి 1 నుంచి ఉదయం 7 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్ ఉంటుంది. మంగళవారం సరఫరా నిలిచిపోయి పంపులు నడవకపోవడంతో పక్క రైతులు రాత్రి 2 గంటలకు వచ్చి యూదగిరిని నిద్ర లేపారు.

వారితో కలసి పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లిన యూదగిరి.. ఫ్యూజ్ వైర్ వేస్తుండగా షాక్‌కు గురై పడిపోయూడు. పక్కనున్న రైతులు వెంటనే చేర్యాల ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయకముందే బుధవారం ఉదయం 7 గంటలకు యూదగిరి మృతి చెందాడు. భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పులి రమేష్ తెలిపారు.

మరిన్ని వార్తలు