సీఎం కార్యాలయానికి రైతు ఫోన్‌

14 May, 2018 13:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెక్కులో పేరు తప్పుగా  ఉందని ఫిర్యాదు

మహాదేవపూర్‌ వరంగల్‌ రూరల్‌ : రైతు బంధు పథకంలోని చెక్కులు, పాస్‌ పుస్తకాల్లో తప్పులు దొర్లుతున్నాయి. తండ్రి పేరు, సర్వే నంబర్లు, భూముల వివరాలు సరిగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెక్కులో పేరు తప్పు రావడంతో ఓ రైతు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మçహాదేవపూర్‌ మండల కేంద్రం శివారులోని సర్వేనంబర్‌ 101/ఎలో ఆరేందుల సత్యనారాయణకు 3.29 భూమి ఉంది.

ఈ భూమికి సంబంధించి సత్యనారాయణకు బదులు పెద్దింటి చంద్రయ్య పేరుతో చెక్కు వచ్చింది. దీంతో రైతు సత్యనారాయణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేశాడు. జిల్లా కలెక్టర్‌ను ఆదేశించి తగిన న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని సత్యనారాయణ తెలిపారు. మీ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని సత్యనారాయణ మొబైల్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మెస్సేజ్‌ కూడా వచ్చింది. 

మరిన్ని వార్తలు