రుణమే యమపాశమై..

29 Nov, 2014 23:39 IST|Sakshi
రుణమే యమపాశమై..

మోమిన్‌పేట: ఆరుగాలం కుటుంబీకులంతా రెక్కలుముక్కలు చేసుకున్నారు. పంటలు బాగా పండితే అప్పులు తీర్చొచ్చని భావించారు. వర్షాలు సరిగా కురవకపోవడంతో పెట్టుబడులు కూడా సరిగా రాలేదు. అప్పులు పెరిగాయి. వాటిని తీర్చేమార్గం కానరావడం లేదని మనోవేదనకు గురైన ఓ కౌలురైతు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని ఏన్కతలలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోతురాజు పాండు(39), అనిత దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

పాండుకు గ్రామంలో సెంటు భూమి కూడా లేకపోవడంతో గ్రామంలో 11 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేశాడు. కుటుం బీకులు ఆరుగాలం కష్టపడ్డారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. పాండు పెట్టుబడి కోసం తెలిసిన వారి వద్ద రూ. లక్ష అప్పు చేశాడు. స్థానికంగా ఓ బ్యాంకులో భార్య నగలు తనఖా పెట్టి మరో రూ. 50 వేలు రుణం తీసుకున్నాడు. పంటలు బాగా పండితే అప్పులు తీర్చొచ్చని ఆశించిన పాండుకు నిరాశే మిగిలింది. అప్పులు ఎలా తీరుద్దామని పాండు ఇటీవల భార్య అనితతో చెబుతూ మదనపడుతున్నాడు.

ఈక్రమంలో మనస్తాపం చెందిన ఆయన శుక్రవారం సాయంత్రం పొలంలో పురుగుమందు తాగా డు. పొరుగు రైతుల సాయంతో కుటుం బీకులు పాండును చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. పరిస్థితి విషమిం చడంతో ఆయన ఆదేరోజు రాత్రి మృతి చెందాడు. శనివారం పోలీసులు పోస్టుమార్టం అనంతరం పాండు మృతదేహాన్ని కు టుంబీకులకు అప్పగించారు. పాండు ఆత్మహత్యతో కుటుంబీకులు వీధినపడ్డారు. అందరితో కలుపుగోలుగా ఉండే అతడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. పాండు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు శనివారం తెలిపారు.

మరిన్ని వార్తలు