తడిసిన ధాన్యం కొనుగోలు చేయ్యాలి

14 May, 2018 12:15 IST|Sakshi
ఎంపీ బండారు దత్తాత్రేయ

సాక్షి, నల్గొండ :  అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అదుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన జిల్లాలోని కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఇస్తున్న రూ.1500 లకు అదనంగా మరో రూ.500 జమ చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు పథకంలో సగభాగం మంత్రులు, ఎమ్మెల్యేలకే సరిపోతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఐకేపీ సెంటర్లలో రైతులను పట్టించుకునే నాధులు లేరని, వారికి పట్టాలు పాసు బుక్‌లు ఇచ్చే వారే కరువయ్యారని విమర్శించారు. తడిచిన ధాన్యాన్ని మిల్లింగ్‌ తరలించే దిక్కు లేదని, వీటిని వెంటనే పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కృషి చేయాలన్నారు. అదే విధంగా రైతులకు సబ్సీడీ కింద ఎరువులు, విత్తనాలు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు