‘మధుకాన్’ ముట్టడి ఉద్రిక్తం

1 Dec, 2014 02:49 IST|Sakshi
‘మధుకాన్’ ముట్టడి ఉద్రిక్తం

రాజేశ్వరపురం (నేలకొండపల్లి): మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రైతుల ఆందోళనకు యూజమాన్యం తలొగ్గింది. చర్చలకు ఆహ్వానించింది. మద్దతు ధరగా 3000 రూపాయలు ఇవ్వాలన్న డిమాండుపై నిర్ణయం తీసుకునేందుకు 20 రోజుల గడువు కావాలని యూజమాన్యం కోరింది. దీనికి రైతు సంఘాల నాయకులు అంగీకరించారు.

చెరకు టన్నుకు 3000 రూపాయలు చెల్లించాలన్న డిమాండుతో ఐదు రోజులుగా చెరకు రైతులు ఆందోళన సాగిస్తున్నారు. రైతు సంఘాల అఖిలప క్షం పిలుపుతో వారు ఆదివారం రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్స్ ఫ్యాక్టరీని ముట్టడించారు. ఫ్యాక్టరీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రైతులతో చర్చించేందు కు యాజమాన్యం ససేమిరా అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో, ఖమ్మం డీఎస్పీ దక్షిణమూర్తి చొరవ తీసుకున్నారు. ఆయన ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాసరావుతో మాట్లాడి, రైతులతో చర్చలకు అంగీకరింపచేశారు.

రైతు ప్రతినిధులు రచ్చా నరసింహారావు, మానుకొండ శ్రీనివాసరావు, నర్రా పూర్ణచందర్‌రావు, తోటకూరి రాజు, సురేందర్‌రెడ్డి, చావా లెనిన్‌తో కూడిన 11 మంది ప్రతినిధుల బృందంతో జీఎం తన చాంబర్‌లో చర్చలు జరిపారు. ఇవి ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆగ్రహోదగ్రులయ్యూరు. వారు పోలీసు వలయూన్ని నెట్టుకుంటూ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్దకు వచ్చారు.

అక్కడ వీరిని కూసుమంచి, ఖమ్మం రూరల్, ఖమ్మం మహిళ పోలీస్‌స్టేషన్ సీఐలు రవీందర్‌రెడ్డి, తిరపతిరెడ్డి, అంజలి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. తమ డిమాండుపై యాజమాన్యం ప్రకటన చేయూలని ఆందోళనకారులు నినదించారు. ఫ్యాక్టరీ జీఎం శ్రీనివాసరావు వద్దకు కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి వెళ్లి మాట్లాడారు. ఆ తరువాత ఆయన ఆందోళనకారుల వద్దకు వచ్చి.. ‘‘మీ డిమాండుపై చర్చించేందుకు 20 రోజుల్లోగా ప్రత్యేక సమావేశాన్ని యూజమాన్యం నిర్వహిస్తుందని జీఎం చెప్పారు’’ అని తెలిపారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు.

మాట తప్పితే ప్రత్యక్ష ఆందోళన
మధుకాన్ మాజమాన్యం మాట తప్పితే ప్రత్యక్ష ఆం దోళన మళ్లీ మొదలవుతుందని టీఆర్‌ఎస్ రైతు వి భాగం రాష్ట్ర నాయకుడు నల్లమల వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఆందోళన విరమణ అనంతరం రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మధుకాన్ యూజమాన్యం మొండి వైఖరి విడనాడి, రైతులకు గిట్టుబాటు ధర నిర్ణరుుంచాలని డిమాండ్ చేశారు.

ఈ ఆందోళనలో చెరకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొంతు రాంబాబు, నాయకుడు నున్నా నా గేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, నాయకుడు బత్తుల లెనిన్, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు నంబూరి ప్రసాద్, మానుకొండ శ్రీనివాసరావు, బొల్లినేని వెంకటేశ్వరరావు, న్యూడెమెక్రసీ నాయకుడు టి.హనుమంతరావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొరివి వెంకటరత్నం, నాయకుడు జొగుపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు