ధర తగ్గించడంపై భగ్గుమన్న రైతు

18 May, 2018 03:21 IST|Sakshi

కేసముద్రం మార్కెట్‌లో పసుపునకు నిప్పు

కేసముద్రం: మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధర తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌ ఎదుట పసుపును పోసి నిప్పంటించారు. మార్కెట్‌లో ఈ–నామ్‌ అమలవుతుండగా పుసుపునకు ఆన్‌లైన్‌లో టెండర్ల తర్వాత అధికారులు రైతులకు ధర తెలియజేయలేదు.

ఆన్‌లైన్‌ టెండర్‌ వేసిన వ్యాపారుల్లో కొందరు కాంటాలు పెట్టుకోవడానికి వెళ్లలేదు. దీంతో రైతులు సాయంత్రం వరకు పడిగాపుకాశారు. ఆ తర్వాత ఓ వ్యాపారి పసుపురాశుల వద్దకు వెళ్లి క్వింటాల్‌కు రూ.5 వేలు ధర పెడతానంటూ కొంతమంది రైతుల లాట్‌ నంబర్‌ చీటీలపై రాశాడు. ఆన్‌లైన్‌లో రూ.6 వేలు ధర పడగా రూ.వెయ్యి తగ్గించడంతో ఆగ్రహించారు. దీంతో వారు కొంత పసుపును మార్కెట్‌ ఎదుట పోసి నిప్పంటించి కాలబెట్టారు.  

మరిన్ని వార్తలు