రైతులకు పరిహారం ఇవ్వడం లేదు

30 Jul, 2017 04:36 IST|Sakshi

విద్యుత్‌ సంస్థలపై హైకోర్టుకు సీఐఎఫ్‌ఏ ప్రధాన సలహాదారు లేఖ
సాక్షి, హైదరాబాద్‌: రైతుల భూముల్లో విద్యుత్‌ లైన్లు వేస్తున్న విద్యుత్‌ సంస్థలు ఆ రైతులకు పరిహా రం ఇవ్వడం లేదని, ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కన్సార్షియం ఆఫ్‌ ఇండియన్‌ ఫార్మర్స్‌ అసోసియే షన్స్‌ (సీఐఎఫ్‌ఎ) ప్రధాన సలహాదారు పి.చంగల్‌రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. పొలాల్లో వేస్తున్న విద్యుత్‌ లైన్ల విషయంలో ఉభయ రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలు 2003 విద్యుత్‌ చట్టం, వర్క్స్‌ ఆఫ్‌ లైసెన్సీస్‌ రూల్స్‌ 2006కు విరుద్ధంగా వ్యవహరిస్తు న్నాయని పేర్కొన్నారు.

విద్యుత్‌ లైన్ల వల్ల రైతులు కొంత భూమి కోల్పోతున్నారని, కానీ విద్యుత్‌ సంస్థలు పరిహారం చెల్లించడం లేదన్నారు. వారికి పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు. లేఖను జస్టిస్‌ చల్లా కోదండరాం నేతృత్వంలోని ప్రజాప్రయోజన వ్యాజ్యం కమిటీ పిల్‌గా స్వీక రించవచ్చంది. ఈ వ్యవహారంలో న్యాయవాది శేషాద్రి గతంలో రాసిన లేఖను పిల్‌గా పరిగణించి హైకోర్టు విచారణ జరుపుతోందని పేర్కొంది. చంగల్‌రెడ్డి లేఖను ఈ పిల్‌కు జతచేసింది. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, విద్యుత్‌ సంస్థలను ప్రతివాదులుగా చేర్చింది.

మరిన్ని వార్తలు