పత్తి మద్ధతు ధర కోసం రాస్తారోకో

4 Feb, 2015 12:00 IST|Sakshi

ఆదిలాబాద్: పత్తికి మద్దతు ధరను పెంచాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని చెన్నూరు మండలంలోని కిష్టంపేట వద్ద జాతీయ రహదారిపై  రైతులు రాస్తారోకో నిర్వహించారు. పత్తి క్వింటాల్ కు రూ.4050 నుంచి రూ. 3950 లకు తగ్గించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే మద్దతు ధరను పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. రాస్తారోకో వల్ల రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మండలంలోని  చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి గ్రామాలకు చెందిన 100 మంది రైతులు ఈ రాస్తారోకోలో పాల్గొన్నారు.
(చెన్నూరు)

>
మరిన్ని వార్తలు