నిజామాబాద్‌లో ఎర్రజొన్న రైతుల ఆందోళన

17 Feb, 2018 14:38 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఎర్రజొన్న రైతులు ఆందోళన కొనసాగుతోంది. జిల్లాలోని జుక్రాన్‌పల్లిలో శనివారం రైతుల నిరసన చేపట్టారు. సుమారు వెయ్యి మంది రైతులు ర్యాలీ నిర్వహించారు. ఎర్రజొన్నకు రూ. 4,500 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాగా, గత రెండు రోజులుగా ఎర్రజొన్న, పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని రైతుల ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు