కరెంటు కోతలపై నిరసనాగ్రహం

7 Oct, 2014 01:05 IST|Sakshi

ఖానాపూర్ : కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు ఖానాపూర్‌లో ఆందోళనకు దిగారు. స్థానిక జగన్నాథ్ చౌరస్తాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో కాలిపోయిన విద్యుత్ మోటార్ల తో సోమవారం గంటకు పైగా రాస్తారోకో చేశారు.

విద్యుత్ ఆధారితంగా పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకుండా అనధికారికంగా ఎడాపెడా కోతలు విధిస్తోందని మండిపడ్డారు. అలాగే నాణ్యమై న విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపో యి, మోటార్లు కాలి తీవ్రంగా నష్టపోతున్నామంటూ రోడ్డు పై బైఠాయించారు. బతుకమ్మ వేడుకల పేరిట తెలంగాణ జాగృతికి రూ.10 కోట్లు, బ్రాండ్ అంబాసిడర్ అంటూ టెన్ని స్ క్రీడాకారిణి సానియా మీర్జాకు రూ.2 కోట్లు అవసరం లేకు న్నా ఇచ్చిన కేసీఆర్ రైతు సమస్యలపై మాత్రం దృష్టిసారించ డం లేదని ఎద్దేవా చేశారు. పంటలు పండక అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కోతలతో నష్టపోయిన పంటలతో పాటు లోవోల్టేజీతో కాలిపోయిన మోటార్ల రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 తెలంగాణ రాష్ట్రంలో ఇదేనా బాగు!
 తెలంగాణ వస్తే రాష్ట్రం బాగుపడుతుందనుకున్నామే గానీ ఈ విధంగా సమస్య ఉంటుందనుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కష్టాలను ప్రజలు మూడేళ్లపాటు ఓపిక పట్టాలని కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. రైతులు ఎన్నిసార్లు ఆందోళన చేసినా అటు ప్రభుత్వంలో గానీ ఇటు అధికారుల్లో గానీ ఎలాంటి చలనం లేదని విమర్శించారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ బైఠాయింపు కొనసాగించారు.

 బలవంతంగా అరెస్టు
 అంతకుముందు చౌరస్తా ప్రాంతంలోని ఇతర కూడళ్లంన్నింటి రహదారులకు అడ్డంగా వాహనాలు పెట్టి దిగ్బంధించారు. దీంతో ఎస్సై టీవీరావుతో పాటు పోలీసులు ఎంత చెప్పినా రైతులు ఆందోళన విరమించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐ జీవన్‌రెడ్డి రంగప్రవేశం చేసి పలువురు రైతులు, నాయకులను బలవంతంగా అరెస్టు చేసి వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా గోసంపల్లెకు చెందిన రైతు కొమురయ్య సీఐ వాహనం కింద టైరుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని నినాదాలు చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, ఎంపీటీసీ కమ్మల బాలరాజు, మాజీ ఎంపీటీసీ అంకం రాజేందర్, ఉప సర్పంచులు బర్లపాటి బీమరాజు, వీరేశ్, నాయకులు సల్ల దేవెందర్‌రెడ్డి, కరిపె శ్రీనివాస్, బీసీ రమేశ్, మాన్క దేవన్న, ఆమంద శ్రీనివాస్, పంతులు, నరేందర్, గంగాధర్, సందీప్, చందు, స్కైలాబ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు