పంటకు ముందే ‘మద్దతు’!

23 Nov, 2019 03:22 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: అంకాపూర్‌.. ఇదో ఆదర్శ గ్రామం. గ్రామస్తుల ఐకమత్యంతో ఎన్నో అద్భుతాలు సృష్టించి.. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకొని మార్గదర్శకంగా నిలుస్తోంది. అనేక స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకున్న ఈ గ్రామంలో ఈసారి రైతులు సంఘంగా ఏర్పడి పంటకు ముందే మద్దతు ధర నిర్ణయించారు. ‘ఇక పంటకు మద్దతు ధర నిర్ణయించేది వ్యాపారులు కాదు.. మేమే’అంటూ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పైగా పండించబోయే (మార్చిలో చేతికందే) పంటకు ముందే ధర ప్రకటించారు. ఈ మేరకు వ్యాపారులను గ్రామాలకు పిలిచి ఒప్పందం కుదుర్చుకున్నారు.

వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు 
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఎర్రజొన్న (గడ్డి విత్తనం) ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే సాగవుతుంది. ఏటా తమ పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ మార్కెటింగ్‌ కష్టాలను అధిగమించేందుకు అంకాపూర్‌ లో రైతులంతా ఏకమయ్యారు. ఈ రబీ సీజనులో సుమారు 1,300 ఎకరాల్లో ఎర్రజొన్న పంటను సాగు చేయాలని నిర్ణయించారు. సుమారు 1,400 టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనాకొచ్చిన రైతులు.. విత్తన వ్యాపారులతో సంప్రదింపులు జరిపారు. తమ పంటకు వేలం వేస్తున్నట్లు ప్రకటించారు.

15 మంది విత్తన వ్యాపారులు, సీడ్‌ కంపెనీలు ఈ గ్రామానికి వచ్చి వేలంలో పాల్గొనగా.. 200 టన్నుల చొప్పున ఏడుగురు వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చిలో చేతికందే తమ ఎర్రజొన్న పంటకు క్వింటాలుకు రూ.2,600 చొప్పున కొనుగోలు చేసేలా విత్తన వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు. పంట విలువలో పది శాతం మొత్తాన్ని అడ్వాన్సు రూపంలో తీసుకుని పంటను సాగు చేస్తున్నారు. తీరా పంట పండిన తర్వాత మార్కెట్‌లో ఆ ధర లేదంటూ వ్యాపారులు చేతులెత్తేయకుండా ముందు జాగ్రత్తగా పేరున్న వ్యక్తుల జమానతు తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నగరంలో మాస్క్‌ మస్ట్‌

నేటి ముఖ్యాంశాలు..

అక్రమార్కులపై పీడీ పంజా!

సకుటుంబ కరెన్సీ ముద్రణ!

పీఎఫ్‌ బకాయిలు చెల్లించేలా జోక్యం చేసుకోండి 

నేడు డిపోల వద్ద ర్యాలీలు: జేఏసీ

అందరికీ అందుబాటులో వైద్యం

పీఆర్సీ నివేదిక సిద్ధం 

సమ్మె విరమణ సమయంలో హల్‌చల్‌ చేస్తారా? 

సుపరిపాలనలో రాష్ట్రానికి ఇండియా టుడే అవార్డు 

 సాయుధపోరాట యోధుడు యాదగిరిరెడ్డి ఇకలేరు

గవర్నర్లకు ఉపరాష్ట్రపతి ప్రత్యేక విందు 

ఓయూ మాజీ వీసీ రామకిష్టయ్య కన్నుమూత 

 డ్రైవర్‌ మృతితో అట్టుడికిన పరిగి 

చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

నిజాం నిధులు వచ్చేస్తున్నాయ్‌..! 

డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్‌: ముగ్గురి మృతి 

జొన్న కిచిడీ, రాగుల పట్టీ

సకుటుంబ కరెన్సీ ముద్రణ!

రూట్ల ప్రైవేటీకరణ నోటిఫికేషన్‌కు కసరత్తు 

అక్రమార్కులపై పీడీ పంజా!

ఆర్టీసీపై నేడు సీఎం సమీక్ష 

రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు రైట్‌ రైట్‌..

ఆ రూమర్స్‌ నమ్మొద్దు: సీపీ అంజనీ కుమార్‌

ఈనాటి ముఖ్యాంశాలు

వైరల్‌ : ప్రార్థన చేసి, గుంజీలు తీసి ఆపై..

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

మున్సిపల్‌ ఎన్నికలపై విచారణ వాయిదా

బాలాపూర్‌ సీఐపై బదిలీ వేటు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందర్నీ ఏకం చేసే మాధ్యమం సినిమా

రకుల్‌ ఎటాక్‌

మోసగాళ్లు

ఓ మై గాడ్‌.. డాడీ!

మహేశ్‌బాబు రఫ్‌ ఆడేశారు

మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్‌