కులబహిష్కరణ చేశారని.. ఆత్మహత్యాయత్నం!

6 Oct, 2014 13:07 IST|Sakshi

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. దుబ్బాక మండలం పోతిరెడ్డిపేటలో కుల బహిష్కరణకు గురయ్యామన్న ఆవేదనతో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొడుకు చనిపోతాడన్న బాధతో కిందే ఉన్న తండ్రి పురుగుల మందు తాగేశాడు. పోతిరెడ్డిపేటకు చెందిన మురళీగౌడ్ స్థానికంగా ఉన్న కల్లు సొసైటీలో సభ్యుడు. అక్కడ కల్లు సీసా పది రూపాయలకు అమ్మాలని ఓ కట్టుబాటు ఉంది. అయితే మురళీగౌడ్ దాన్ని ఉల్లంఘించి ఐదు రూపాయలకే అమ్ముతున్నాడంటూ అతడిని అటు సొసైటీ నుంచి, ఇటు కులం నుంచి కూడా బహిష్కరించారు.

దాంతో తీవ్ర మనస్తాపానికి చెందిన మురళీగౌడ్.. బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొడుకు పడిపోతాడేమోనని ఆందోళన చెందిన తండ్రి నర్సాగౌడ్ అక్కడే పురుగుల మందు తాగేశాడు. దాంతో స్థానికులు అతడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తండ్రి విషయం తెలిసిన మురళీగౌడ్ కూడా టవర్ దిగాడు. అయితే, అసలు కల్లు దుకాణంలో ఇలా తీర్మానం చేయడం, కులబహిష్కరణ చేయడం చట్ట విరుద్ధమని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే తాము చర్యలు తీసుకుంటామంటున్నారు.

>
మరిన్ని వార్తలు