ఖరీఫ్‌లో ఊరట

12 Jul, 2016 01:15 IST|Sakshi

తగ్గుముఖం పట్టిన ఎరువుల ధరలు
ప్రకటించిన వ్యవసాయ శాఖ   అన్నదాతకు కాస్త ఉపశమనం

 
 
 
వరంగల్ : రెండేళ్లుగా వరుస కరువుతో ఇబ్బంది పడుతున్న అన్నదాతకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొంచెం ఊరటనిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎరువుల కంపెనీలు కూడా అన్నదాతకు లాభం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారుు. వివిధ ఎరువుల గరిష్ట చిల్లర ధర(ఎంఆర్‌పీ)లకు సంబంధించి వ్యవసాయ శాఖ సోమవారం ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం వ్యవసాయంలో ఎక్కువగా వినియోగించే డీఏపీ, కాంప్లెక్సు ఎరువుల ధరలు కొంత వరకు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి సరుకుల ధరలు గణనీయంగా తగ్గడంతో ఎరువుల ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
 
టన్నుకు రూ.5వేలు
యూరియా మినహా... మిగిలిన రకాల ఎరువుల ధరలను టన్నుకు రూ.5 వేల వరకు తగ్గించింది. వ్యవసాయంలో ఎక్కువగా వినియోగించే డీఏపీపై టన్నుకు రూ.2500 తగ్గించి రూ.22 వేలుగా నిర్ణయించింది. పొటాష్(ఎంఓపీ)పై టన్నుకు రూ.5 వేలు తగ్గించి రూ.11 వేలు ధరగా ప్రకటించారు. జూలై ఆరంభం నుంచే కొత్త ధరలకు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వ రంగ ఎరువుల కంపెనీలు చర్యలు తీసుకుంటున్నారుు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎరువుల ధరలను తగ్గించాలని నిర్ణయించడంతో ప్రైవేటు కంపెనీలు కూడా అదే దారిలో నడుస్తున్నారుు. కేంద్రప్రభుత్వం 2010 ఏప్రిల్ నుంచి ఎరువుల సబ్సిడీ విధానాన్ని మార్చింది. పోషకాల ఆధారిత సబ్సిడీ(ఎన్‌బీఎస్) విధానం అమలులోకి తెచ్చింది. అంతకుముందు ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో ఎరువుల గరిష్ట చిల్లర అమ్మకం ధరల్లో తేడా ఉండేది కాదు. కానీ ఎన్‌బీఎస్‌తో ప్రభుత్వం కంపెనీలకు ఇచ్చే సబ్సిడీ స్థిరంగా ఉండి ఎంఆర్‌పీ ధరల్లో మార్పులు ఉంటున్నాయి. అరుుతే, ఎన్‌బీఎస్ అమల్లోకి వచ్చినప్పటి ఎరువుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. రైతులు సాగులో ఎక్కువగా వినియోగించే యూరియా, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల ధరలు మూడు, నాలుగు రెట్లు పెరిగాయి. కాగా, కరువు పరిస్థితులతో రెండేళ్లుగా సాగు ఎక్కువగా లేకపోవడం, ముడి సరుకుల ధరలు తగ్గడంతో మొదటిసారిగా కంపెనీలు ఎరువుల ధరలను తగ్గించాయి.
 

>
మరిన్ని వార్తలు