ముగ్గురిని బలిగొన్న జ్వరం

30 Oct, 2014 03:40 IST|Sakshi
ముగ్గురిని బలిగొన్న జ్వరం

జిల్లాలో విషజ్వరాలు తీవ్రస్థాయిలో ప్రబలుతున్నాయి. విషజ్వరంతో బుధవారం ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఐదో తరగతి చదివే బాలుడు కూడా ఉన్నాడు. మరో ఇద్దరు మహిళలు.   
 
 నాడు తండ్రి.. నేడు తల్లి


మహబూబాబాద్ టౌన్ : విషజ్వరం.. ఇద్దరు పిల్లలను అనాథను చేసింది. నాలుగేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులను పొట్టనబెట్టుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మానుకోటలోని పత్తిపాక ప్రాంతానికి చెందిన దండు లక్ష్మి(38)- ప్రసాద్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. నాలుగేళ్ల క్రితం ప్రసాద్ విషజ్వరంతో మృతిచెందాడు. నాటి నుంచి లక్ష్మి కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కొంతకాలం క్రితం పెద్ద కుమార్తె రాజకుమారికి పెళ్లి చేసింది. ఐదు రోజులుగా లక్ష్మి విషజ్వరంతో బాధపడుతోంది. మానుకోట ఏరియా ఆస్పత్రిలో సోమవారం వరకు చికిత్స చేరుుంచుకుంది. బుధవారం తెల్లవారుజామున మృతిచెందింది. కుమారుడు లేకపోవడ ంతో చిన్న కుమార్తె చామంతి తలకొరివిపెట్టింది.  లక్ష్మి మృతదేహాన్ని కేవీపీఎస్ డివిజన్ కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి, ఆ సంఘం నాయకులు ఆలువాల రాజయ్య, ఆనంద్, తప్పెట్ల వెంకన్న, గొర్రె రవి, కుమార్, బెజ్జం ఐలేష్ సందర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతురాలి కుటుంబానికి ఆర్డీఓ మధుసూదన్‌నాయక్ రూ. 3 వే లు ఆర్ధిక సహాయం చేశారు. ప్రభుత్వపరంగా సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
 
సూర్యతండాలో బాలుడు..

సూర్యతండా(రాయపర్తి): మండలంలోని సూర్యతం డా శివారు కొత్తతండాలో విషజ్వరం తో బాలుడు మృతి చెందాడు. స్థానికు ల కథనం ప్రకా రం.. తండాకు చెందిన బానోతు వీరు, బూలీల కుమారుడు రాంబాబు(12) ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా చికిత్స చేరుుంచినా తగ్గకపోవడంతో ఎంజీఎంలో చేర్పించారు. బుధవారం చికిత్సపొందుతూ మృతి చెందాడు. కాగా, తండాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హామ్యానాయక్ కోరారు.  
 
బైరాన్‌పల్లిలో మహిళ..

బైరాన్‌పల్లి(హసన్‌పర్తి): మండలంలోని బైరాన్‌పల్లి శివారు హరిశ్చంద్రనాయక్ తండాకు చెందిన నూనావత్ లక్ష్మి(36) విషజ్వరంతో మృతిచెందింది. పదిరోజులుగా ఈమె జ్వరంతో బాధపడుతోంది. కుటుంబసభ్యులు ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. లక్ష్మికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. 15 రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన నూనావత్ రాజు డెంగీతో మృతి చెందాడు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా