శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి

10 Apr, 2018 11:03 IST|Sakshi
మెదక్‌ మండలం పిల్లికోటల్‌ వద్ద కలెక్టరేట్‌ ఎదురుగా ధర్నా నిర్వహిస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లు

ఫీల్డ్‌అసిస్టెంట్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌

విధుల బహిష్కరణ..కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

మెదక్‌రూరల్‌: ఫీల్డ్‌అసిస్టెంట్లకు అసిస్టెంట్‌లకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం మెదక్‌ కలెక్టరేట్‌ కార్యాలయం ఎదురుగా పిల్లికోటల్‌ వద్ద జిల్లాకు చెందిన ఫీల్డ్‌అసిస్టెంట్‌లు విధులు బహిష్కరించి ఒక్కరోజు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ ధార్మారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ జాతీయ హమీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్‌లకు అసిస్టెంట్‌ పంచాయతీ కార్యదర్శిగా హోదా కల్పించాలని, పెరిగిన నిత్యవసర ధరలకు అనుగునంగా ప్రస్తుతం ఉన్న రూ. 8900 వేతనాన్ని రూ. 20వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు.

ఫీల్డ్‌అసిస్టెంట్ల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలని,  వేతనం పై 20 శాతం ఇంక్రిమెంట్‌ సౌకర్యం కల్పించడంతో పాటు డబుల్‌ బెడ్రూం ఇళ్ళను ఇవ్వాలన్నారు. వికలాంగులైన ఫీల్డ్‌అసిస్టెంట్‌లకు అలవెన్స్‌ ఇవ్వాలని తెలిపారు. సీనియర్‌ మేట్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ కేటగిరి లిస్టు 1, 2 ,3గా కాకుండా గతంలో మాదిరిగానే కొనసాగించాలని కోరారు. , నూతనంగా ఏర్పాటుచేస్తున్న మున్సిపాలిటీలో, నగర పంచాయతీలలో పనిచేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లను యదావిధిగా ఉపాధిహామీలోనే ఉద్యోగ అవకాశం కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు రవి, పోచయ్య, శ్రీశైలం, ప్రసాద్, శేఖర్, రాములు, దామోదర్, సిద్దిరాములు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు