చింతలూరులో ఫిల్టర్‌బెడ్‌ కట్టిస్తాం

29 Oct, 2017 02:46 IST|Sakshi

సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి

రాయికల్‌: జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం చింతలూరులో యుద్ధప్రాతి పదికన వాటర్‌ ప్లాంట్‌ కట్టిస్తామని స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి చెప్పారు.  వాటర్‌ క్లోరినేషన్‌ శాతం తెలు సుకునేందుకు పరీక్షలునిర్వహించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధి కారులను ఆదేశించారు.

‘సాక్షి’ మెయిన్‌లో ‘మరో ఉద్దానం.. చింతలూరు’శీర్షికతో ప్రచురితమైన కథనానికి  జీవన్‌రెడ్డి స్పందించారు. శనివారం ఆ గ్రామాన్ని సందర్శిం చారు. కిడ్నీ వ్యాధి బాధితులను పరామర్శించారు. నాణ్యమైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తానన్నారు.  కాలనీవాసులను నడిపిస్తూ వారిలో ఆత్మస్థైర్యం  నింపారు.

టీడీపీ – టీఆర్‌ఎస్‌ మిలాఖత్‌!
సాక్షి, జగిత్యాల: టీఆర్‌ఎస్‌.. టీడీపీపై సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ ఎమ్మె ల్యేలు రైతు సమ స్యలపై ఆందోళన చేపడితే.. టీడీపీ, బీజేపీలు సభలోనే ఉం డిపోయాయని విమ ర్శించారు.

శనివారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌ మొదటి నుంచే మిలాఖత్‌ అయి ఉన్నాయనీ, చంద్రబాబు కనుసన్నల్లోనే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారన్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించడమే దీనికి నిదర్శ నమన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు