నేడే పరిషత్‌ తుది పోలింగ్‌

14 May, 2019 08:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిషత్‌ పోరు చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం ఎన్నికల పోలింగ్‌ ముగియనుంది. 27 జిల్లాల పరిధిలోని 161 జెడ్పీటీసీ స్థానాలకు 741 మంది, 1,738 ఎంపీటీసీ స్థానాల్లో 5,726 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. చివరి విడతలో దాదాపు 46.64 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎస్‌ఈసీ పూర్తిచేసింది. మంగళవారం ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్‌ సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. ఈనెల 27న ఉదయం 8 గంటలకు మూడు విడతల పరిషత్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.

సోమవారం రూ.5.16 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు మొత్తం రూ.1.02 కోట్ల విలువైన నగదు, రూ.1.01 కోట్ల విలువైన ఇతర వస్తువులను పోలీసులు, ఎన్నికల అధికారులు జప్తుచేశారు. గ్రామ, మండల స్థాయిల్లో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు తమ సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు.  
 

మరిన్ని వార్తలు