బ్యాటరీ వ్యర్థాల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

22 May, 2018 07:18 IST|Sakshi

శంషాబాద్‌ : లారీ బ్యాటరీ వ్యర్థాల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్‌లోని గగన్‌పహాడ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ బయట ఆగి ఉన్న నాలుగు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు రూ.45 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ షర్క్యుట్‌ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని సమాచారం. ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. 

మరిన్ని వార్తలు