హోండా షోరూంలో భారీ అగ్నిప్రమాదం

24 Mar, 2018 12:03 IST|Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక తాడ్‌బండ్‌లో ఉన్న హోండా షోరూంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ స్థాయిలో మంటలు చెలరేగి చుట్టుపక్కల వ్యాపించాయి.

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు