ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం

26 Feb, 2015 13:30 IST|Sakshi

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయలోని నీరజ్ ఇంటర్‌నేషనల్ స్కూల్లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనను చిత్రీకరించేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బందితో స్కూల్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. రిపోర్టర్ల కెమెరాలు లాక్కొని ధ్వంసం చేశారు. ప్రమాద తీవ్రత తెలియాల్సి ఉంది..

మరిన్ని వార్తలు