షార్ట్ సర్క్యూట్‌తో 4 గేదెలు, 20 దూడలు మృతి

18 May, 2015 15:57 IST|Sakshi

రంగారెడ్డి (హయత్ నగర్) : ఓ డైరీ ఫాంలో సంభవించిన అగ్ని ప్రమాదంతో 20 దూడలు, నాలుగు గేదెలు మృతి చెందాయి. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం ఇంజపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరగడంతో డైరీ ఫాంలో ఉన్న 20 దూడలు మృతి చెందగా, మరో 20 గేదెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. సుమారు రూ. 40 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.

మరిన్ని వార్తలు